గురువారం 26 నవంబర్ 2020
Business - Sep 25, 2020 , 00:09:57

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఆర్‌ఐఎల్‌ చేతికి!

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఆర్‌ఐఎల్‌ చేతికి!

ముంబై: దక్షిణాది మార్కెట్లో పట్టు సాధించడానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పావులు కదుపుతున్నదా? అవుననే అంటున్నాయి ఇండస్ట్రీవర్గాలు. రిటైల్‌, టెలికం, ఎలక్ట్రానిక్‌ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న ఆర్‌ఐఎల్‌.. దక్షిణాదికి చెందిన బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ను కొనుగోలు చేయబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ ఒప్పంద విలువ రూ.3 వేల కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా. 1980లో పవన్‌ కుమార్‌ బజాజ్‌ అనే వ్యాపారవేత్త బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ పేరుతో షోరూంలను ఆరంభించారు.   ప్రస్తుతం సంస్థకు దక్షిణాదిన ఉన్న 60 స్టోర్లలో 1,200 మంది సిబ్బంది పని చేస్తున్నారు.