గురువారం 13 ఆగస్టు 2020
Business - Jul 15, 2020 , 10:28:48

నేడు రిలయన్స్‌ ఏజీఎం..కీలక ప్రకటనలు చేయనున్న ముకేశ్‌ అంబానీ

నేడు రిలయన్స్‌ ఏజీఎం..కీలక ప్రకటనలు చేయనున్న ముకేశ్‌ అంబానీ

ముంబై:   రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాదారుల 43వ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) బుధవారం జరగనుంది. కరోనా నేపథ్యంలో తొలిసారిగా రిలయన్స్‌ వర్చువల్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నది.  మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానున్న ఏజీఎం కోసం ఇన్వెస్టర్లు ఆస్తకిగా ఎదురుచూస్తున్నారు.  రిలయన్స్‌ ఛైర్మన్‌  ముకేశ్‌ అంబానీ ఏజీఎంలో పలు కీలక ప్రకటనలు చేయనున్నారు.  జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి విదేశీ సంస్థల పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటంతో భవిష్యత్‌ వ్యాపార ప్రణాళికలను వెల్లడించనున్నట్లు తెలుస్తున్నది. అలాగే సౌదీ చమురు సంస్థ ఆరామ్‌కోతో  ఒప్పందంపై  సమావేశంలో  స్పష్టతరానుంది. 

జియోలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్‌ ఆసక్తి చూపుతున్నట్టు వస్తున్న వార్తలపై ముకేశ్‌ క్లారిటీ ఇవ్వనున్నారు.  వాట్సాప్‌ ద్వారా జియో మార్ట్‌ కార్యకలాపాల విస్తరణ, ఆన్‌లైన్‌ చెల్లింపులు  ఆర్‌ఐఎల్‌ ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాల ద్వారా ఏజీఎం లైవ్‌ చూడొచ్చు.    రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌  రూ.12లక్షల కోట్లకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి భారత  కంపెనీగా రిలయన్స్‌  చరిత్రసృష్టించింది.  logo