శనివారం 15 ఆగస్టు 2020
Business - Jul 14, 2020 , 00:00:03

సెప్టెంబర్‌ 30లోగా రిటర్నులను వెరిఫై చేసుకోవాలి

సెప్టెంబర్‌ 30లోగా రిటర్నులను వెరిఫై చేసుకోవాలి

  • పన్ను చెల్లింపుదారులకు ఐటీ విభాగం స్పష్టీకరణ

న్యూఢిల్లీ: 2015-16 నుంచి 2019-20 మదింపు సంవత్సరాలకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో దాఖలు చేసిన పన్ను రిటర్నులను ఇంకా వెరిఫై చేసుకోని పన్ను చెల్లింపుదారులకు ఏకకాల సడలింపు ఇస్తున్నట్టు ఆదాయ పన్ను (ఐటీ) విభాగం సోమవారం వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30లోగా రిటర్నుల వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తిచేసుకోవాలని వారికి స్పష్టం చేసింది. డిజిటల్‌ సిగ్నేచర్‌ లేకుండా ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులు ఆధార్‌ ఓటీపీ (వన్‌-టైమ్‌ పాస్‌వర్డ్‌)ను ఉపయోగించడం ద్వారా.. లేదంటే నెట్‌ బ్యాంకింగ్‌తో ఈ-ఫైలింగ్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ అవడం ద్వారా రిటర్నులను వెరిఫై చేసుకోవాలని తెలిపింది. ఇవి రెండూ కుదరకపోతే ఐటీఆర్‌ను అప్‌లోడ్‌ చేసిన 120 రోజుల్లోగా వ్యక్తిగతంగా సంతకం చేసిన ఐటీఆర్‌-5 కాపీని పోస్టు ద్వారా సీపీసీ బెంగళూరుకు పంపి రిటర్నులను వెరిఫై చేసుకోవాలని సూచించింది. logo