శనివారం 05 డిసెంబర్ 2020
Business - May 24, 2020 , 23:39:32

రూ.9 లక్షల కోట్ల వ్యాపారానికి గండి

రూ.9 లక్షల కోట్ల వ్యాపారానికి గండి

  • భవిష్యత్‌పై ఆందోళనలో రిటైల్‌ వ్యాపారులు

న్యూఢిల్లీ, మే 24: కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ వల్ల దేశీయ రిటైల్‌ వ్యాపారులు గత 60 రోజుల్లో రూ.9 లక్షల కోట్ల వ్యాపారాన్ని కోల్పోయారని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) ఆదివారం వెల్లడించింది. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ రూపంలో దాదాపు రూ.1.5 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్టు పేర్కొన్నది. కొవిడ్‌-19 వ్యాప్తితో దేశవ్యాప్తంగా దుకాణాలు, వాణిజ్య మార్కెట్లు మూతపడటంతో దేశీయ వ్యాపారరంగం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, ప్రభుత్వం నుంచి ఎటువంటి విధానపరమైన తోడ్పాటు లభించకపోవడంతో భవిష్యత్తుపై వ్యాపారులు ఆందోళన చెందుతున్నారని తెలిపింది. గత సోమవారం నుంచి 5 శాతం వ్యాపార కార్యకలాపాలు మాత్రమే సాగుతున్నాయని, 80 శాతం మంది ఉద్యోగులు తమ స్వస్థలాలకు తరలిపోవడంతో ప్రస్తుతం దుకాణాల్లో కేవలం 8 శాతం మంది సిబ్బందే విధులకు హాజరవుతున్నారని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ వివరించారు.