ఆదివారం 05 జూలై 2020
Business - Jun 01, 2020 , 00:29:25

ఆతిథ్యం రెడీ 8న తెరుచుకోనున్న హోటళ్లు, రెస్టారెంట్లు

ఆతిథ్యం రెడీ 8న తెరుచుకోనున్న హోటళ్లు, రెస్టారెంట్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా మూతబడిన హోటళ్లు, రెస్టారెంట్లు ఎట్టకేలకు తెరుచుకోనున్నాయి. కంటైన్మెంట్‌ జోన్లు మినహా ఈ నెల 8 నుంచి అన్నిచోట్ల తిరిగి ప్రారంభించుకోవచ్చని కేంద్రం అనుమతిచ్చింది. దీంతో హోటల్‌, రెస్టారెంట్‌ యాజమాన్యాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.కాగా, కొవిడ్‌-19 నిబంధనలు కచ్ఛితంగా పాటిస్తూ సేవలందించడం సవాల్‌తో కూడుకున్నదేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చిన్నాచితకా రెస్టారెంట్లు కోలుకొనేందుకు 12-18 నెలల సమయం పట్టవచ్చన్న అంచనాలు పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

‘లాక్‌డౌన్‌ కాలంలో ఆదాటయం లేకపోయినప్పటికీ అద్దెలు, మినిమమ్‌ యూజర్‌ చార్జీలు, సిబ్బంది సంక్షేమం చూస్తూ వచ్చాం. కష్టాల్లో ఉన్న మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. ఈ కష్టకా లంలో చేయూత అవసరం’ 

-కంచర్ల అశోక్‌ రెడ్డి,హైదరాబాద్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

‘లాక్‌డౌన్‌ దగ్గర్నుంచి ప్రభుత్వంతో మేము కలిసి పనిచేస్తున్నాం. వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి వసతి సదుపాయాలను కల్పించాం. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జూన్‌ 8 నుంచి సేవలను అందుబాటులోకి తెస్తాం’

-రోహిత్‌ కపూర్‌, ఓయో  ఇండియా  సీఈవో


logo