సోమవారం 01 మార్చి 2021
Business - Jan 12, 2021 , 18:50:49

రూ.4 ల‌క్ష‌ల కోట్ల ఇండ్ల ప్రాజెక్టులు నిలిచిపాయే!

రూ.4 ల‌క్ష‌ల కోట్ల ఇండ్ల ప్రాజెక్టులు నిలిచిపాయే!

న్యూఢిల్లీ: దేశ‌వ్యాప్తంగా ఇండ్ల నిర్మాణ రంగం విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న‌ది. ఏడు ప్ర‌ధాన న‌గ‌రాల్లో రూ.4.05 ల‌క్ష‌ల కోట్ల విలువైన ఇండ్ల ప్రాజెక్టులు పూర్తిగా నిలిచిపోవ‌డం గానీ, జాప్యం కావ‌డం గానీ జ‌రుగుతున్న‌ది.వీటిలో ఐదు ల‌క్ష‌ల‌కు పైగా ఇండ్లు 2013లో గానీ, అంత‌కుముందు గానీ నిర్మాణం చేప‌ట్టిన‌వే. ఈ ప్రాజెక్టుల‌న్నీ బెంగ‌ళూరు, చెన్నై, హైద‌రాబాద్‌, కోల్‌క‌తా, ముంబై మెట్రోపాలిట‌న్ రీజియ‌న్ (ఎంఎంఆర్‌), పుణె, జాతీయ రాజ‌ధాని ప్రాంతం (ఎన్సీఆర్‌) ప‌రిధిలోవే. 

ఎన్సీఆర్ ప‌రిధిలో అత్య‌ధిక సంఖ్య‌లో 1.90 ల‌క్ష‌ల యూనిట్లు ఇండ్ల నిర్మాణ ప్రాజెక్టులు నిలిచిపోయాయి లేదా జాప్యం అవుతున్నాయి. వీటి విలువ రూ.1.19 ల‌క్ష‌ల కోట్లు ఉంటుంద‌ని ప్రస్తుతం అంచ‌నా. ఇక ఎంఎంఆర్‌లో రూ.2.02 ల‌క్ష‌ల కోట్ల విలువైన 1.80 ల‌క్ష‌ల ఇండ్ల యూనిట్లు స్తంభించాయి. నేష‌న‌ల్ క్యాపిట‌ల్ రీజియ‌న్‌, ముంబై మెట్రోపాలిట‌న్ రీజియ‌న్ ప‌రిధిలో 74 శాతం ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి లేదా ర‌ద్ద‌య్యాయి. 

ద‌క్షిణాది మెట్రో న‌గ‌రాలు బెంగ‌ళూరు, చెన్నై, హైద‌రాబాద్‌ల్లో కేవ‌లం 8 శాతం ప్రాజెక్టులు మాత్ర‌మే నిలిచిపోయాయి. పుణెలో సుమారు 16, కోల్‌క‌తాలో రెండు శాతం ఇండ్ల నిర్మాణాల్లో జాప్యం జ‌రిగింది. అయితే, 190 ప్రాజెక్టుల్లో జాప్యం జ‌రిగినా, కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి నేప‌థ్యంలోనూ త‌లెత్తిన అంత‌రాయం కొన‌సాగినా 73,500 యూనిట్లు పూర్త‌య్యాయి. 

అన‌రాక్ ప్రాప‌ర్టీ క‌న్స‌ల్టెంట్స్ చైర్మ‌న్ అనూజ్ పూరీ మాట్లాడుతూ, గ‌త ద‌శాబ్ది కాలంలో ఎన్న‌డూ లేని విధంగా ప్రాజెక్టుల జాప్యం ఒక శాపం, స్పెష‌ల్ విండో అఫార్డ‌బుల్ అండ్ మిడ్ ఇన్‌కం హౌసింగ్ (స్వామిహ్‌) ప‌థ‌కం కింద నిధులు స‌మ‌కూర్చ‌డంతో నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి పుంజుకున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం, ఆర్బీఐ ద్ర‌వ్య ల‌భ్య‌త చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంతో ఇండ్ల నిర్మాణ ప్రాజెక్టుల‌కు చేయూత ల‌భించింది అని తెలిపారు. 

ప్రాజెక్టుల‌ను పూర్తి చేసిన రీజియ‌న్ల‌లో ఎంఎంఆర్ 2020లో 84 శాతం ప్రాజ‌క్టులు అంటే 29,700కి పైగా ఇండ్లు, పుణెలో 44 ప్రాజెక్టులు, బెంగ‌ళూరులో 20, కోల్‌క‌తాలో 10, చెన్నైలో 8, హైద‌రాబాద్‌లో 6 ప్రాజెక్టులు పూర్త‌య్యాయ‌ని అన్‌రాక్ తెలిపాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo