శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Dec 28, 2020 , 01:38:01

ఈ నెల 28 నుంచి పసిడి బాండ్‌ రూ.5 వేలు

ఈ నెల 28 నుంచి పసిడి బాండ్‌ రూ.5 వేలు

రిజర్వుబ్యాంక్‌ మరోమారు సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను విక్రయించబోతున్నది. ఈసారి ఒక్కో గ్రాము ధర రూ.5 వేలుగా నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను తొమ్మిదిసారి జారీ చేస్తున్న ఈ బాండ్లు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 1 వరకు విక్రయించబోతున్నది. గడిచిన మూడు రోజులుగా పసిడి ధరల సరాసరి ఆధారంగా ఈ బాండ్‌ ధరను నిర్ణయించింది. ఈ బాండ్లను కొనుగోలు చేయాలనుకునేవారికి మరో శుభవార్తను కూడా అందించింది. ఆన్‌లైన్‌, డిజిటల్‌ ద్వారా చెల్లింపులు జరిపేవారికి ఒక్కో గ్రాముపై రూ.50 వరకు రాయితీ కూడా ఇస్తున్నది. వీరు ఒక్కోగ్రాము బాండ్‌కు రూ.4,950 చెల్లిస్తే సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రిజర్వుబ్యాంక్‌ ప్రతియేటా 12సార్లు గోల్డ్‌ బాండ్లను జారీ చేస్తున్నది. పసిడి వినిమయాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ సర్కార్‌ ఈ బాండ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కనీసంగా ఒక్క గ్రాము, గరిష్ఠంగా 4 కిలోల వరకు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.9,652.78 కోట్ల నిధులను సమీకరించింది.    


VIDEOS

logo