టూరిజంలో మళ్లీ కొలువుల కళ!

న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన సుదీర్ఘ లాక్డౌన్ల అనంతరం పర్యాటక రంగం క్రమంగా పుంజుకుంటుందనే ఆశలు మొలకెత్తుతున్నాయి. వైరస్ వ్యాప్తితో వ్యాపారం దెబ్బతిని, కొలువుల కోతలతో సతమతమైన టూరిజం రంగం ఈ ఏడాది గాడినపడుతుందని జాబ్ సైట్ ఇండీడ్ అంచనా వేస్తోంది. లాక్డౌన్లు ముగిసి నెలలు గడుస్తున్నా టూరిజం రంగంలో హైరింగ్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020 డిసెంబర్లో 51 శాతం తగ్గుముఖం పట్టింది. 2019, 2020 మధ్య ఈ రంగంలో నియామకాలు 41 శాతం పడిపోయాయి.
ఇక ఉద్యోగాల కోసం సెర్చ్ చేసే వారి సంఖ్య సైతం 31 శాతం తగ్గిందని ఇండీడ్ డేటా వెల్లడించింది. కరోనా వైరస్‌తో ప్రయాణాలు నిలిచిపోవడం, వైరస్ వ్యాప్తి భయాలతో టూరిజం రంగంలో జాబ్ పోస్టింగ్స్, ఉద్యోగాల కోసం సెర్చి చేసే వారి సంఖ్య తగ్గినా ఈ ఏడాదిలో కొత్త పర్యాటక సీజన్లో పరిస్ధితి మారుతుందని ఆశిస్తున్నామని ఇండీడ్ ఎండీ శశి కుమార్ చెప్పారు. దేశీయంగా ప్రయాణాలు ఊపందుకోవడం, వ్యాక్సినేషన్ ప్రక్రియతో టూరిజం రంగం వృద్ధి బాట పట్టి కొత్త కొలువులు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- అంతర్గాలం
- మళ్లీ గ్రే లిస్ట్‌లోనే పాక్
- నేడు దేశవ్యాప్త బంద్
- శభాష్ నర్సింలు..
- ఒక్క రోజు నెట్ బిల్లు రూ. 4.6 లక్షలు
- జాగ్రత్తతో సైబర్‌నేరాలకు చెక్: సీపీ సజ్జనార్
- ప్రభుత్వం పారిశ్రామికరంగానికి ప్రోత్సాహం
- అమ్మాయి మా బంధువే.. రూ.90 కోట్ల కట్నమిప్పిస్తాం..
- వేసవి తట్టుకునేలా.. మరో సబ్‌స్టేషన్
- ఎంఎస్ఎంఈ ద్వారా ఆన్లైన్లో టాయ్ ఫేయిర్