సోమవారం 21 సెప్టెంబర్ 2020
Business - Aug 06, 2020 , 12:24:14

రెపో, రివ‌ర్స్ రెపో య‌ధాత‌థం: ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌

రెపో, రివ‌ర్స్ రెపో య‌ధాత‌థం: ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌

హైద‌రాబాద్‌: ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.  రెపో రేటు, రివ‌ర్స్ రెపో రేటును మార్చ‌లేదు.  రెపో రేటు 4 శాతం, రివ‌ర్స్ రెపో రేటును 3.3 శాతంగానే య‌ధాత‌ధంగా ఉంచారు.  దీంతో బాంకులు ఇచ్చే అప్పులపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయన్నమాట. కీల‌క‌మైన ప‌నుల‌ను నిర్వ‌హించేందుకు ప్ర‌త్యేక‌మైన క్వారెంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఏకైక సెంట్ర‌ల్ బ్యాంక్ ఆర్బీఐ అని శ‌క్తికాంత్‌దాస్ తెలిపారు.  ప్ర‌స్తుతం తొలి అర్థ‌భాగంలో జీడీపీ వృద్ధి రేటు ఆశాజ‌న‌కంగా ఉండ‌ద‌న్నారు. 2020-21వ సంవ‌త్స‌రానికి రియ‌ల్ జీడీపీ వృద్ధి రేటు నెగటివ్‌లోనే ఉంటుంద‌న్నారు. ఆర్థిక గ‌మ‌నం నెమ్మ‌దిగా మొద‌లైంద‌ని, కానీ మ‌ళ్లీ వైర‌స్ కేసుల సంఖ్య పెర‌గ‌డంతో లాక్‌డౌన్లు అమ‌లు చేస్తున్నార‌ని,  దీంతో మ‌ళ్లీ మంద‌గ‌మ‌నం ఏర్ప‌డిన‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. 

రెపో రేటు అంటే... ఆర్‌బీ వద్ద బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి. ఈ అప్పులు ఇచ్చినందుకు ఆర్‌బీఐ వడ్డీ వసూలు చేస్తుంది. ఈ వడ్డీ రేటునే రెపో రేటు అంటారు. రెపోరేటు తక్కువ ఉంటే బ్యాంకులు తక్కువ వడ్డీకి అప్పులిస్తాయి.

రివర్స్‌ రెపోరేటు అంటే.. కొన్ని బ్యాంకులు తమ ఉన్న అదనపు డబ్బును అర్‌బీఐ వద్ద డిపాజిట్‌ చేస్తాయి. దీనికి ఆర్‌బీఐ వడ్డీ చెల్లిస్తుంది. ఆర్‌బీఐ చెల్లించే వడ్డీ రేటునే రివర్స్‌ రెపోరేటు అంటారు. ఇది రెపో రేటుకన్నా తక్కువగానే ఉంటుంది. మర్కెట్లో పరిస్థితులు బాగాలేనపుడు స్థిర వడ్డీ వస్తుందనే ఉద్దేశంతో బ్యాంకులు తమ అదనపు నగదు నిల్వలను ఆర్‌బీఐ వద్ద ఉంచుతాయి. 


logo