శనివారం 30 మే 2020
Business - Apr 15, 2020 , 00:22:55

చైనాకు రెనో గుడ్‌బై

చైనాకు రెనో గుడ్‌బై

బీజింగ్‌: ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనో..చైనాలో వ్యాపారాన్ని పూర్తిగా మూసివేసింది. ఏడేండ్ల క్రితం చైనా ప్రభుత్వరంగ సంస్థ డాంగ్‌ఫెంగ్‌తో కలిసి అక్కడ వ్యాపారాన్ని ఆరంభించిన సంస్థకు అమ్మకాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. కరోనా వైరస్‌తో అతలాకుతలమవుతున్న చైనా ఆర్థిక వ్యవస్థ కంటే ముందుగానే సంస్థ కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నది. మరోవైపు విద్యుత్‌, కమర్షియల్‌ వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ప్రకటించింది. ప్రపంచ ఆటోమొబైల్‌ రంగానికి దిక్సూచిగా ఉన్న చైనా ప్రస్తుతం ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్నది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వాహన విక్రయాలు 45.4 శాతం పడిపోయాయి. 


logo