మంగళవారం 09 మార్చి 2021
Business - Jan 17, 2021 , 17:07:29

క‌స్ట‌మ‌ర్ల‌కు రెనాల్ట్ డిస్కౌంట్ల వ‌ర్షం!

క‌స్ట‌మ‌ర్ల‌కు రెనాల్ట్ డిస్కౌంట్ల వ‌ర్షం!

న్యూఢిల్లీ: ప‌్ర‌ముఖ కార్ల త‌యారీ సంస్థ రెనాల్ట్‌ ఇండియా ప‌లు మోడ‌ల్ కార్ల‌పై రూ.65 వేల వ‌ర‌కు రాయితీలు అందుబాటులోకి తెచ్చింది. ట్రైబ‌ర్‌, డ‌స్త‌ర్‌, క్విడ్ మోడ‌ల్ కార్ల‌పై ప్ర‌తిపాదించిన ఈ రాయితీలు ఈ నెలాఖ‌రు వ‌ర‌కు అందుబాటులో ఉంటాయి. నూత‌న సంవ‌త్స‌రంలో శుభారంభాన్ని అందుకోవాల‌న్న లక్ష్యంతో రెనాల్ట్ ఈ రాయితీలు ప్ర‌క‌టించింది. 

క్విడ్‌పై రూ.50 వేల వ‌ర‌కు బెనిఫిట్లు

రెనాల్ట్ ఎంట్రీ లెవెల్ కారు క్విడ్‌పై రూ.50 వేల వ‌ర‌కు బెనిఫిట్ క‌ల్పిస్తున్న‌ట్లు త‌న అధికారిక వెబ్‌సైట్‌లో ప్ర‌క‌టించింది. రూ.20 వేల క్యాష్ డిస్కౌంట్‌తోపాటు ఎఎంటీ వేరియంట్ కొనుగోలు చేస్తే రూ.20 వేల ఎక్స్చేంజ్ బెనిఫిట్ ల‌భిస్తుంది. అయితే, మాన్యువ‌ల్ వేరియంట్ క్విడ్ కారు కొనుగోలుపై రూ.15 వేల చొప్పున క్యాష్ డిస్కౌంట్‌, ఎక్స్చేంజ్ బెనిఫిట్ ల‌భిస్తుంది. 

పీఎస్‌యూ క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రో రూ.10వేల రాయితీ

ఇవి కాకుండా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల క‌స్ట‌మ‌ర్ల‌కు అద‌నంగా కార్పొరేట్ డిస్కౌంట్ రూపేణా రూ.10 వేల వ‌ర‌కు అందుబాటులో ఉంది. ఇవి కాక లాయాల్టీ బెనిఫిట్ లేదా ఎక్స్చేంజ్ బెనిఫిట్ రూపేణ మ‌రో రూ.10 వేల వ‌ర‌కు ల‌బ్ధి చేకూరుతుంది. క్విడ్ కారు కొనుగోలు చేసిన వారికి 5.99 శాతం వ‌డ్డీరేటు ప్ర‌త్యేకంగా వ‌ర్తింప‌జేస్తారు. 

ట‌ర్బో డ‌స్ట‌ర్ మీద రూ.65 వేల వ‌ర‌కూ..

1.3 లీట‌ర్ల ట‌ర్బో వేరియంట్ డ‌స్ట‌ర్ ఎస్‌యూవీ మోడ‌ల్ కారు కొనుగోలుపై రూ.65 వేల వ‌ర‌కు ల‌బ్ధి చేకూరుతుంది. ఇందులో ఎక్స్చేంజ్ బెనిఫిట్ రూ.30 వేల‌తోపాటు లాయాల్టీ బెనిఫిట్స్ రూ.15 వేలు, క్యాష్ బెనిఫిట్ రూ.20 వేలు ఉంది. ఎక్స్చేంజ్ బెనిఫిట్ కేవ‌లం ఆర్ఎక్స్ఎస్‌, ఆర్ఎక్స్‌జ‌డ్ వేరియంట్ల‌కే వ‌ర్తిస్తుంది. 

పీఎస్‌యూ క‌స్ట‌మ‌ర్ల‌కు రూ.30 వేల బెనిఫిట్‌

రెనాల్ట్ అప్రూవ్డ్ లిస్ట్‌లో ఉన్న కార్పొరేట్ సంస్థ‌లు, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల క‌స్ట‌మ‌ర్ల‌కు ట‌ర్బో డ‌స్ట‌ర్ కొనుగోలుపై కార్పొరేట్ డిస్కౌంట్ పేరిట రూ.30 వేల ల‌బ్ధి చేకూరుస్తోంది. అయితే పెట్రోల్ వేరియంట్ 1.5 లీట‌ర్ల సామ‌ర్థ్యంతో కూడిన ఇంజిన్ గ‌ల ట‌ర్బో డ‌స్ట‌ర్ వ‌ర్ష‌న్ మీద మాత్రం రూ.45 వేల రాయితీ అందుబాటులో ఉంది. ఇందులో లాయాల్టీ బెనిఫెట్ రూ.15 వేలు, ఎక్స్చేంజ్ బెనిఫిట్ రూ.30 వేలుగా ఉంది. 

ఎంపీవీ ట్రైబ‌ర్‌పై రూ.60 వేల వ‌ర‌కు రాయితీ

మ‌ల్టీ ప‌ర్ప‌స్ వెహిక‌ల్ ట్రైబ‌ర్ కొనుగోలు చేసిన వారికి రెనాల్ట్ రూ.60 వేల వ‌ర‌కు క్యాష్ బెనిఫిట్ అందుబాటులోకి తెచ్చింది. ఎఎంటీ మోడ‌ల్ కారును ఎంపిక చేసుకున్న వారికి క్యాష్ బెనిఫిట్ రూ.20 వేలు, ఎక్స్చేంజ్ బెనిఫిట్ రూ.30 వేలు, లాయాల్టీ బెనిఫిట్ రూ.10 వేలు క‌ల్పిస్తోంది. సాధార‌ణ మోడ‌ల్ ట్రైబ‌ర్ కారు కొంటే రూ.20 వేల ఎక్స్చేంజ్ బెనిఫిట్‌, రూ.10వేల క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ ల‌భిస్తోంది. ఇక రెనాల్ట్ అప్రూవ్డ్ కార్పొరేట్, పీఎస్‌యూ క‌స్ట‌మ‌ర్ల‌కు కార్పొరేట్ బెనిఫిట్ రూపేణా మ‌రో రూ.10వేల రాయితీ క‌ల్పిస్తున్న‌ది. అంతేకాదు ట్రైబ‌ర్ కొనుగోలుదారుల‌కు ప్ర‌త్యేకంగా 5.99 శాతం వ‌డ్డీరేటు రుణ ప‌ర‌ప‌తి క‌ల్పిస్తోంది రెనాల్ట్‌. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo