గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Feb 23, 2021 , 01:29:54

అమెజాన్‌కు ఊరట

అమెజాన్‌కు ఊరట

రిలయన్స్‌-ఫ్యూచర్‌ డీల్‌కు సుప్రీం కోర్టు బ్రేక్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: రిలయన్స్‌-ఫ్యూచర్‌ గ్రూపుల మధ్య కుదిరిన ఒప్పందం కీలక మలుపు తిరిగింది. రూ.24,713 కోట్ల విలువైన ఈ డీల్‌కు మళ్లీ బ్రేక్‌ పడింది. ఈ ఒప్పందం విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ చేసిన విజ్ఞప్తికి సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశంపై జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం స్టే విధించింది. అంతేకాకుండా అమెజాన్‌ పిటిషన్‌పై ఫ్యూచర్‌ రిటైల్‌ సంస్థతోపాటు ఆ గ్రూపు అధినేత కిశోర్‌ బియానీ, ఇతరులకు నోటీసులు జారీ చేసింది. ఈ ఒప్పందం విషయంలో అమెజాన్‌ చేస్తున్న వాదనపై మూడు వారాల్లోగా స్పందించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నది. అలాగే ఈ వివాదంపై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. రిలయన్స్‌తో ఒప్పందం విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఈ నెల 2న ఫ్యూచర్‌ రిటైల్‌ సంస్థను ఆదేశించడంతో అమెజాన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

VIDEOS

logo