శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Feb 02, 2021 , 23:57:06

రిల‌య‌న్స్‌-ఫ్యూచ‌ర్ డీల్‌పై తాత్కాలిక నిషేధం!

రిల‌య‌న్స్‌-ఫ్యూచ‌ర్ డీల్‌పై తాత్కాలిక నిషేధం!

న్యూఢిల్లీ: రిల‌య‌న్స్‌, ఫ్యూచ‌ర్ గ్రూప్ మ‌ధ్య జ‌రిగిన ఒప్పందం అమ‌లును తాత్కాలికంగా నిలిపివేయాల‌ని ఢిల్లీ హైకోర్టు మంగ‌ళ‌వారం ఆదేశించింది. భార‌త‌దేశంలోని రిటైల్ మార్కెట్‌లో ఆధిప‌త్యం కోసం ప్ర‌య‌త్నిస్తున్న అమెజాన్‌కు మ‌ధ్యంత‌ర విజ‌యంగానే భావించొచ్చు. రిల‌య‌న్స్‌, ఫ్యూచ‌ర్స్ రిటైల్ మ‌ధ్య ఒప్పందాన్ని త‌దుప‌రి అమ‌లు చేయ‌కుండా య‌థాత‌థ స్థాయి కొన‌సాగించాల‌ని ఆదేశించింది. 

అప్పుల ఊబిలో ఉన్న ఫ్యూచ‌ర్స్ రిటైల్స్.. ముకేశ్ అంబానీ సార‌థ్యంలోని రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌కు 3.4 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు విక్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఇంత‌కుముందు ఫ్యూచ‌ర్స్ కూప‌న్స్ సంస్థ‌తో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించ‌డ‌మేన‌ని ఆరోపిస్తూ అమెజాన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించింది. హైకోర్టు ఆదేశంపై స్పందించ‌డానికి ఫ్యూచ‌ర్స్ గ్రూప్‌, రిల‌య‌న్స్‌, అమెజాన్ సంస్థ‌ల ప్ర‌తినిధులు స్పందించ‌లేదు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo