గురువారం 13 ఆగస్టు 2020
Business - Jul 27, 2020 , 11:40:13

రెండో అతిపెద్ద చ‌మురు సంస్థ‌గా రిల‌య‌న్స్ రిఫైన‌రీ

రెండో అతిపెద్ద చ‌మురు సంస్థ‌గా రిల‌య‌న్స్ రిఫైన‌రీ

హైద‌రాబాద్‌: ముఖేశ్ అంబానీకి చెందిన రిల‌య‌న్స్ రిఫైన‌రీ సంస్థ‌.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రెండ‌వ చ‌మురు సంస్థ‌గా రికార్డు సృష్టించింది. ఎక్సాన్‌మోబిల్ కార్పొరేష‌న్‌ను వెన‌క్కి నెట్టిన రిల‌య‌న్స్ సంస్థ రెండవ స్థానాన్ని చేజిక్కించుకున్న‌ది. చ‌మురు వ్యాపారంలో సౌదీకి చెందిన ఆరామ్‌కో కంపెనీ నెంబ‌ర్ వ‌న్‌గా ఉన్న విష‌యం తెలిసిందే. డిజిట‌ల్ రంగంలోనూ దూసుకువెళ్తున్న రిల‌య‌న్స్‌లోకి పెట్టుబుడుల వ‌ర్షం కురుస్తున్న‌ది. 

శుక్ర‌వారం రోజు రిల‌య‌న్స్ రిఫైన‌రీ సంస్థ 4.3 శాతం లాభాల‌ను ఆర్జించింది. ఆ కంపెనీ ఖాతాలోకి 8 బిలియ‌న్ల డాల‌ర్లు వ‌చ్చాయి.  దీంతో ఆ కంపెనీ మార్కెట్ విలువు 189 బిలియ‌న్ల డాల‌ర్లకు చేరుకున్న‌ది. ఎక్సాన్‌మోబిల్ సంస్థ ఇటీవ‌ల బిలియ‌న్ డాల‌ర్లు న‌ష్ట‌పోయింది.  రిల‌య‌న్స్ షేర్లు కూడా ఈ ఏడాది 43 శాతం దూసుకువెళ్లాయి. మ‌రో వైపు ఎక్సాన్ మోబిల్ షేర్లు 39 శాతం ప‌డిపోయాయి. ఆరామ్‌కో కంపెనీ మాత్రం 1.76 ట్రిలియ‌న్ల డాల‌ర్ల‌తో అతిపెద్ద ఇంధ‌న కంపెనీగా కొన‌సాగుతున్న‌ది.  logo