శనివారం 30 మే 2020
Business - May 09, 2020 , 01:29:22

జియోతో విస్టా జోడీ

జియోతో విస్టా జోడీ

విలువ రూ.11 వేల కోట్లు

న్యూఢిల్లీ, మే 8: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెంది టెలికం వెంచర్‌ జియో మరో అమెరికా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇదివరకే ఫేస్‌బుక్‌తో వాటా విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకున్న జియోలో 2.32 శాతం వాటాను కొనుగోలు చేయబోతున్నట్లు తాజాగా విస్టా ఈక్విటీ పార్టనర్స్‌  ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ రూ.11,367 కోట్లు. గత రెండు వారాల్లో జియో కుదుర్చుకున్న మూడో ఒప్పందమిది. వీటి మొత్తం విలువ రూ.60,596.37 కోట్లు. ప్రస్తుతం జియో ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లుగా, ఎంటర్‌ప్రైజ్‌ విలువ రూ.5.16 లక్షల కోట్లుగా లెక్కకట్టారు. విస్టా కో-ఫౌండర్‌ బ్రియాన్‌ సేథ్‌ భారత సంతతికి చెందినవారు. ఆయన తండ్రి గుజరాతీయుడు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ యజమాని ముకేశ్‌ అంబానీది కూడా గుజరాత్‌ కావడంతో ఈ వాటా కొనుగోలు ఒప్పందానికి లైన్‌ క్లియర్‌ అయింది. జియోలో 20 శాతం వాటా విక్రయించనున్నట్లు ప్రకటించిన ముకేశ్‌..ఇప్పటి వరకు 13.46 శాతం విక్రయించారు.


logo