శనివారం 30 మే 2020
Business - May 17, 2020 , 19:17:46

జియోలో 1.34% వాటా కొన్న అమెరికా సంస్థ

జియోలో 1.34% వాటా కొన్న అమెరికా సంస్థ

ముంబై: ముఖేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (రిల్‌) అప్పులు తగ్గించుకొనే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా నాలుగు వారాల్లో మూడుసార్లు వాటాలను అమ్మింది. తాజాగా అమెరికన్‌ సంస్థకు 1.34 శాతం వాటాను అమ్ముకొన్నది. దీని విలువ రూ.6,598 కోట్లుగా ఉన్నది.

అమెరికాలోని న్యూయార్క్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ జనరల్‌ అట్లంటిక్‌కు జియోలో 1.34 శాతం వాటాలను రూ. 6,598.38 కోట్లకు అమ్ముకొన్నది. గత నెలలో ఫేస్‌బుక్‌, సిల్వర్‌ లేక్‌ పార్ట్‌నర్స్‌, విస్టా సంస్థలకు వాటాలు విక్రయించడం ద్వారా రూ.67,194.75 కోట్లను రిలయన్స్‌ సంస్థ సేకరించింది. మన దేశంలో డిజిటల్‌ సొసైటీని నిర్మించేందుకు ప్రముఖ గ్లోబల్‌ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు జియో అవకాశం కల్పిస్తున్నట్టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. వాటాల విక్రయం ద్వారా అందివచ్చే పెట్టుబడులను తరువాతి తరం సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తి, ప్లాట్‌ఫాం తయారీ సంస్థగా రూపుదిద్దేందుకు వినియోగించనున్నట్లు రిలయన్స్‌ స్పష్టంచేసింది.


logo