శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Jan 29, 2021 , 00:44:36

జియో శక్తిమంతమైన బ్రాండ్‌

జియో శక్తిమంతమైన బ్రాండ్‌

  • ప్రపంచంలో ఐదో స్థానం: బ్రాండ్‌ ఫైనాన్స్‌

న్యూఢిల్లీ, జనవరి 28: రిలయన్స్‌ జియో.. ప్రపంచంలోని అత్యంత బలమైన బ్రాండ్లలో ఐదో స్థానంలో నిలిచింది. తాజా బ్రాండ్‌ ఫైనాన్స్‌ గ్లోబల్‌ 500 ర్యాంకింగ్స్‌లో నాలుగేండ్లలోనే ముకేశ్‌ అంబానీ టెలికం సంస్థ టాప్‌-5లోకి చేరడం గమనార్హం. 2016లో మొదలైన జియో.. ప్రస్తుతం భారత్‌లో అతిపెద్ద మొబైల్‌ నెట్‌వర్క్‌గా అవతరించిందని, దాదాపు 40 కోట్ల కస్టమర్లతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా ఉందని ఈ సందర్భంగా బ్రాండ్‌ ఫైనాన్స్‌ ప్రకటించింది. కాగా, శక్తిమంతమైన బ్రాండ్లలో తొలి స్థానంలో చైనా మొబైల్‌ యాప్‌ వుయ్‌చాట్‌ ఉన్నది. రెండో స్థానంలో ఫెరారీ, మూడో స్థానంలో రష్యా బ్యాంక్‌ ఎస్‌బర్‌, నాలుగో స్థానంలో కోకాకోలా ఉన్నాయి. ఇక ఈ ఏడాదికిగాను టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ సంస్థ ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌ అని తేలింది. రెండు, మూడు స్థానాల్లో అమెజాన్‌, గూగుల్‌ ఉన్నాయి. అత్యంత విలువైన టెలికం బ్రాండ్‌గా వెరిజాన్‌ నిలిచింది. దీని విలువ 68.9 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది.  


VIDEOS

logo