మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 22, 2020 , 03:39:52

జియో లాంగ్‌టర్మ్‌ ప్లాన్‌

జియో లాంగ్‌టర్మ్‌ ప్లాన్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: దేశీయ టెలికం మార్కెట్లోకి ‘సునామీ’లా దూసుకొచ్చి సరసమైన టారిఫ్‌ ప్లాన్లతో కేవలం మూడేండ్లలోనే ఎంతోమందికి చేరువవడంతోపాటు అతిపెద్ద నెట్‌వర్క్‌ ఆపరేటర్‌గా ఆవిర్భవించిన రిలయన్స్‌ జియో తమ ప్రీపెయిడ్‌ ఖాతాదారుల కోసం సరికొత్త దీర్ఘకాలిక ప్లాన్‌ను ప్రకటించింది. 336 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉన్న ఈ ప్లాన్‌ ధరను రూ.2,121గా నిర్ణయించింది. 365 రోజుల వ్యాలిడిటీతో ఇప్పటివరకు ఉన్న రూ.2,020 ప్లాన్‌ను తొలిగించింది. దాని ధరను పెంచి కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ కింద రోజుకు 1.5 జీబీ డాటా, 100 ఎస్సెమ్మెస్‌లు అందజేయడంతోపాటు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్‌ సదుపాయాన్ని కల్పించింది. వీటితోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందజేస్తున్నప్పటికీ పాత ప్లాన్‌తో పోలిస్తే కొత్త ప్లాన్‌ చెల్లుబాటు గడువును 29 రోజులు కుదించింది. కానీ రూ.2,399 ధరకు వొడాఫోన్‌, రూ.2,398 ధరతో ఎయిర్‌టెల్‌ అందజేస్తున్న వార్షిక ప్లాన్లతో పోలిస్తే జియో ప్లాన్‌ చవకే. ఈ ప్లాన్‌ జియో యాప్‌తోపాటు పేటీఎం, గూగుల్‌పే లాంటి థర్డ్‌పార్టీ యాప్స్‌లోనూ లభ్యమవుతున్నది.


logo
>>>>>>