గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Jan 29, 2021 , 23:14:46

టీసీఎస్‌పై రిల‌య‌న్స్ పై చేయి! ఎలాగంటే!!

టీసీఎస్‌పై రిల‌య‌న్స్ పై చేయి! ఎలాగంటే!!

న్యూఢిల్లీ: దేశీయ ఐటీ దిగ్గ‌జం టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (టీసీఎస్‌)పై ముకేశ్ అంబానీ సార‌థ్యంలోని రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ శుక్ర‌వారం తిరిగి పైచేయి సాధించింది. దేశంలోకెల్లా అత్యంత వాల్యూబుల్ కంపెనీగా రిల‌య‌న్స్ నిలిచింది. సోమ‌వారం మాత్ర‌మే మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్‌లో టీసీఎస్ దేశంలోకెల్లా అత్యంత వాల్యూబుల్ కంపెనీగా కొన‌సాగింది. శుక్ర‌వారం దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో ట్రేడింగ్ ముగిసిన త‌ర్వాత రిల‌య‌న్స్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ. 11,68,454.02 కోట్లుగా ఉంది. 

టీసీఎస్ కంటే రిల‌య‌న్స్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.374.18 కోట్లు అధికం. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లో టీసీఎస్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ విలువ రూ.11,68,079.84 కోట్లుగా ఉంది. రిల‌య‌న్స్ షేర్ 1.78 శాతం కోల్పోయి రూ.1,843.15 వ‌ద్ద‌, టీసీఎస్ 2.71 శాతం న‌ష్ట‌పోయి రూ.3,112.90 వ‌ద్ద నిలిచింది. మోస్ట్ వాల్యూబుల్ సంస్థ స్థానం కోసం రిల‌య‌న్స్‌, టీసీఎస్ పోటీ ప‌డుతున్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo