శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Jan 24, 2021 , 19:02:22

ఎం క్యాప్ పెరుగుద‌ల‌కు రిల‌య‌న్స్ సార‌థ్యం

ఎం క్యాప్ పెరుగుద‌ల‌కు రిల‌య‌న్స్ సార‌థ్యం

ముంబై: గ‌త వారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ట్రేడింగ్ 50 వేల మార్క్‌ను దాటి దిగి వ‌చ్చినా.. టాప్10 బ్లూ చిప్ కంపెనీల్లో నాలుగు సంస్థ‌ల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.1,15,758.53 కోట్ల‌కు పెరిగింది. మార్కెట్ లీడ‌ర్ రిల‌య‌న్స్ ఎం-క్యాప్ రూ.71,033.44 కోట్లు ఎగ‌బాకింది.

టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (టీసీఎస్‌), రిల‌య‌న్స్‌, హిందూస్థాన్ యూనీలివ‌ర్ (హెచ్‌యూఎల్‌), బ‌జాజ్ ఫైనాన్స్ షేర్లు జోరుగా పెరిగాయి. మ‌రోవైపు హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్‌, భార‌తీ ఎయిర్ టెల్‌ల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.48,941.18 కోట్లు త‌గ్గిపోయింది. 

రిల‌య‌న్స్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.71,033.44 కోట్లు పెరిగి రూ.12,99,363.47 కోట్ల‌కు చేరుకుంది. ఇక టీసీఎస్ ఎం-క్యాప్ రూ.26,191.64 కోట్లు పెరిగి రూ.12,39,562.76 కోట్ల‌కు, హెచ్‌యూఎల్ రూ.13,357.22 కోట్లు పెరిగి రూ.5,65,949.36 కోట్ల‌కు చేరుకున్న‌ది. మ‌రోవైపు బ‌జాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.5,176.23 కోట్లు పెరిగి రూ.2,99,332.25 కోట్ల వ‌ద్ద స్థిర ప‌డింది. 

ఇదిలా ఉంటే బార‌తీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.13,993.5 కోట్లు త‌గ్గి రూ.3,14,703.83 కోట్ల‌కు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.12,502.38 కోట్లు కోల్పోయి రూ.7,95,112.89 కోట్ల వ‌ద్ద స్థిర‌ప‌డింది. హెచ్డీఎఫ్సీ ఎంక్యాప్ రూ.7,677.82 కోట్లు న‌ష్ట‌పోయి రూ.4,66,123.79 కోట్లు, కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ రూ.6,416.75 కోట్లు న‌ష్ట‌పోయి రూ.3,62,665.26 కోట్ల‌కు చేరుకున్న‌ది. 

ఇక ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.6,370.02 కోట్ల మేర‌కు ప‌త‌న‌మై రూ.3,68,375.92 కోట్ల‌కు, ఇన్ఫోసిస్ ఎం క్యాప్ రూ.1,980.71 కోట్లు న‌ష్ట‌పోయి రూ.5,70,976.45 కోట్ల‌కు ప‌రిమిత‌మైంది. 

గ‌త‌వారం బీఎస్ఈ 30 షేర్ల ఇండెక్స్ సెన్సెక్స్ అంత‌ర్గ‌త ట్రేడింగ్‌లో 50,184 పాయింట్ల‌కు దూసుకెళ్లింది. ఇది గ‌తేడాది మార్చి 24న న‌మోదైన 52 వారాల క‌నిష్ట స్థాయి 25,369 పాయింట్ల‌తో పోలిస్తే దాదాపు రెండింత‌లు. గ‌త‌వారం  సెన్సెక్స్ 156.13 పాయింట్లు ల‌బ్ధి పొందింది. శుక్ర‌వారం సెన్సెక్స్ 1.5 శాతం త‌గ్గి 48,878.54 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ-50 218.50 పాయింట్ల న‌ష్టంతో 14,371.90 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. 

గ‌త‌వారం ఇండియ‌న్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేష‌న్ (ఐఆర్ఎఫ్‌సీ)తోపాటు ఇండిగో పెయింట్స్‌, హోం ఫ‌స్ట్ ఫైనాన్స్ కంపెనీ, స్టోవ్ క్రాఫ్ట్ సంస్థ‌ల ఐపీవోలు మార్కెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేశాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo