సోమవారం 13 జూలై 2020
Business - Jun 01, 2020 , 00:41:52

రూ.650 కే పీపీఈ కిట్ ‌అందుబాటులోకి తెస్తున్న రిలయన్స్‌

రూ.650 కే పీపీఈ కిట్ ‌అందుబాటులోకి తెస్తున్న రిలయన్స్‌

న్యూఢిల్లీ, మే 31: మార్కెట్‌ ధరలో మూడో వంతుకే పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) కిట్లను అందుబాటులోకి తెస్తున్నది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఈ కిట్లకు దేశీయంగా భారీ డిమాండ్‌ ఏర్పడిన విషయం తెలిసిందే. అందుకే చైనా నుంచి ఒక్కోటి రూ.2 వేలకు భారత్‌ దిగుమతి చేసుకుంటున్నది. అయితే దీన్ని దాదాపు రూ.650కే రిలయన్స్‌ అందించనున్నది.

ఇందుకు ఇటీవలే తాము కొన్న వస్త్ర, దుస్తుల తయారీ సంస్థ అలోక్‌ ఇండస్ట్రీస్‌ను పీపీఈ తయారీదారుగా కూడా మార్చేసింది. గుజరాత్‌లోని సిల్వస్సాలోగల అలోక్‌ ఇండస్ట్రీస్‌ తయారీ ప్లాంట్లలో పీపీఈ కిట్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రోజుకు లక్షకుపైగా కిట్లను తయారు చేస్తున్నట్లు తెలుస్తున్నది. పీపీఈ సూట్‌లో గ్లోవ్స్‌, షూ కవర్స్‌, ఎన్‌95 మాస్కులు, హెడ్‌గేర్‌, ముఖ కవచం ఉంటాయి.logo