గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Jan 21, 2021 , 20:05:10

రిల‌య‌న్స్ 22-26 మ‌ధ్య డిజిట‌ల్ ఇండియా సేల్‌.. డిస్కౌంట్లు.. ఆఫ‌ర్లు

రిల‌య‌న్స్ 22-26 మ‌ధ్య డిజిట‌ల్ ఇండియా సేల్‌.. డిస్కౌంట్లు.. ఆఫ‌ర్లు

న్యూఢిల్లీ: ‌రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా రిల‌య‌న్స్ రిటైల్స్ అనుబంధ రిల‌య‌న్స్ డిజిట‌ల్ త‌న వినియోగ‌దారుల‌కు అత్యంత ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. వివిధ ర‌కాల ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌పై ఈ నెల 22 నుంచి 26 వ‌ర‌కు అద్భుత‌మైన ఈ ఆఫ‌ర్లు అందుబాటులోకి రానున్నాయి. 

రిప‌బ్లిక్ డే సేల్స్‌లో భాగంగా సిటీ, ఐసీఐసీఐ, కోట‌క్ మ‌హీంద్రా బ్యాంకుల డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల‌పై రూ.10 వేల చెల్లింపుల వ‌ర‌కు 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫ‌ర్ రిల‌య‌న్స్ డిజిట‌ల్‌, మై జియో స్టోర్ల‌లో అందుబాటులో ఉంటుంది. కొట‌క్ మ‌హీంద్రా అండ్ ఐసీఐసీఐ బ్యాంకు కార్డులు, కార్డ్ లెస్ లావాదేవీల‌పై క‌న్జూమ‌ర్ డ్యూర‌బుల్స్ కొనుగోళ్ల‌పైనా ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. ఈఎంఐ, నాన్ ఈఎంఐ లావాదేవీల‌కూ దీన్ని వినియోగించుకోవ‌చ్చు. ట్రాన్సాక్ష‌న్ జ‌రిపిన మూడు గంట‌ల్లోపు ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ అవుతుంది. 

డిజిట‌ల్ ఇండియా సేల్స్ కింద ఐఫోన్‌-12 మినీ ఫోన్ రూ.49,650, శ్యామ్‌సంగ్ వాచ్ ఎల్‌టీఈ (42ఎంఎం) రూ.15,999 వ‌ద్ద ప్రారంభ‌మ‌వుతుంది. శ్యామ్‌సంగ్ ఎస్‌వో ఎఫ్ఈ 256 జీబీ మోడ‌ల్ రూ.39,999ల‌కే ల‌భిస్తుంది. ఇంకా చాలా ప్ర‌జాద‌ర‌ణ పొందిన డెల్ ఇన్‌స్పిరోన్ 5490 లాప్‌టాప్ రూ.61,999, ఇంటెల్ లేటెస్ట్ టెన్త్ జ‌న‌రేష‌న్ ఐ3 ల్యాప్‌టాప్ రూ.33,999, అసుష్ ఈ బుక్ 14 ఇంచ్‌@ రూ.18,999ల‌కే ల‌భిస్తాయి. 

హైసెన్స్‌, తోషిబా, వ‌న్ ప్ల‌స్‌, టీసీఎల్ అండ్ ఇఫాల్కాన్ టీవీ రూ. 12,499, శ్యామ్‌సింగ్ 50 అంగుళాల క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ.64,990, ఎల్జీ ఓలెడ్ టీవీ రూ.64,990, యూహెచ్డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ రూ.34,990ల‌కు కొనుగోలు చేయొచ్చు. ఇక కెల్వినేట‌ర్ 6కేజీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిష‌న్ రూ.19,990, శ్యామ్‌సంగ్ 6.5 కేజీ టాప్ లోడ్ రూ.13,990, హ‌య్య‌ర్ 195 ఎల్ డీసీ రూ.11,990, ప‌నాసోనిక్ ఎస్బీఎస్ రూ.49,990, 1.5 3 స్టార్ ఏసీ రూ.29,990, ఎల్జీ 3 స్టార్ రూ.33,990ల‌కు వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉన్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo