సోమవారం 01 జూన్ 2020
Business - Apr 10, 2020 , 06:05:47

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడావడ్డీరేట్ల తగ్గింపు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడావడ్డీరేట్ల తగ్గింపు

న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీ)..మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు(ఎంసీఎల్‌ఆర్‌)ని 15 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 12 నుంచి అమలులోకి రానున్న ఈ నూతన వడ్డీరేటుతో ఖాతాదారులకు ఆర్థికంగా ప్రయోజనం కలుగనున్నదని బ్యాంక్‌ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. ఏడాది కాలపరిమితి కలిగిన వాహన, రిటైల్‌, గృహ రుణాలపై వడ్డీరేటు 8.15 శాతం నుంచి 8 శాతానికి దిగిరానున్నది. అలాగే ఒక్క రోజు నుంచి ఆరు నెలల్లో లోపు రుణాలపై వడ్డీరేటు కూడా 7.40-7.85 శాతానికి తగ్గనున్నది. 


logo