మంగళవారం 04 ఆగస్టు 2020
Business - Jul 09, 2020 , 02:41:12

ఎస్బీఐ ఎంసీఎల్‌ఆర్‌ తగ్గింపు

ఎస్బీఐ ఎంసీఎల్‌ఆర్‌ తగ్గింపు

ముంబై, జూలై 8: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ)...మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బెస్డ్‌ లెండింగ్‌ రేటు(ఎంసీఎల్‌ఆర్‌)ని 5 బేసిస్‌ పాయింట్ల నుంచి 10 బేసిస్‌ పాయింట్ల వరకు తగ్గించింది. ఈ నెల 10 నుంచి అమలులోకి రానున్న ఈ వడ్డీరేట్లు స్వల్పకాల రుణాలకు మాత్రమే వర్తించనున్నదని తెలిపింది. రుణ వితరణను, డిమాండ్‌ను పెంచే ఉద్దేశంలో భాగంగా మూడు నెలల లోపు రుణాలపై వడ్డీని తగ్గించినట్లు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఎంసీఎల్‌ఆర్‌ రేటు 6.65 శాతానికి పరిమితంకానున్నది. ఎంసీఎల్‌ఆర్‌ని తగ్గించడం ఇది 14వ సారి. మరో ప్రభుత్వరంగ సంస్థయైన ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ కూడా తన ఎంసీఎల్‌ఆర్‌ని 25 బేసిస్‌ పాయింట్లు కోత విధించింది. ఈ నెల 10 నుంచి ఈ వడ్డీరేట్లు అమలులోకి రానున్నాయి.  


logo