శనివారం 06 జూన్ 2020
Business - Apr 21, 2020 , 23:55:50

హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు

హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21: దేశంలో అతిపెద్ద మార్ట్‌గేజ్‌ రుణాలు అందించే హెచ్‌డీఎఫ్‌సీ తన ఖాతాదారులకు శుభవార్తను అందించింది. గృహ రుణాలపై వడ్డీరేటును 15 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్న రిటైల్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటు(ఆర్‌పీఎల్‌ఆర్‌) 15 బేసిస్‌ పాయింట్లు తగ్గనున్నది. బ్యాంక్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో సంస్థకు సంబంధించిన పాత వినియోగదారులకు ఊరట లభించనున్నది. అలాగే రుణాలపై వడ్డీరేటు 8.05 శాతం నుంచి 8.85 శాతానికి దిగిరానున్నాయి. బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ, ఇతర బ్యాంకులు తగ్గించిన తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ ఈ నిర్ణయం తీసుకున్నది. గత నెలలో రిజర్వు బ్యాంక్‌ పాలసీ రేటును 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. 


logo