మంగళవారం 11 ఆగస్టు 2020
Business - Jul 03, 2020 , 02:42:33

చైనాతో తగ్గిన వాణిజ్య లోటు

చైనాతో తగ్గిన వాణిజ్య లోటు

  • గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,63,891 కోట్లు

న్యూఢిల్లీ, జూలై 2: చైనాతో భారత్‌ వాణిజ్య లోటు గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో 48.66 బిలియన్‌ డాలర్లకు (రూ.3,63,891 కోట్లకు) తగ్గింది. చైనా నుంచి దిగుమతులు తగ్గడమే ఇందుకు కారణమని ప్రభుత్వ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019-20లో భారత్‌ నుంచి చైనాకు 16.6 బిలియన్‌ డాలర్ల (రూ.1,24,155 కోట్ల) ఎగుమతులు జరిగాయని, అక్కడి నుంచి వచ్చిన దిగుమతుల విలువ 65.26 బిలియన్‌ డాలర్లు (రూ.4,88,046 కోట్లు)గా ఉన్నదని ఈ గణాంకాలు వెల్లడించాయి. 2017-18లో ఇరు దేశాల మధ్య 63 బిలియన్‌ డాలర్లు (రూ.4,71,255 కోట్లు)గా ఉన్న వాణిజ్య లోటు.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 53.56 బిలియన్‌ డాలర్లకు (రూ.4,00,642 కోట్లకు) తగ్గింది. మరోవైపు చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,225 కోట్లకు తగ్గాయి.


logo