కరెంట్ ఖాతాలో తగ్గిన మిగులు

క్యూ2లో రూ.1,13,439 కోట్లకు పరిమితం
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2020-21) రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబర్)లో దేశ కరెంట్ ఖాతా మిగులు 15.5 బిలియన్ డాలర్ల (రూ.1,13,439 కోట్ల)కు తగ్గింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 2.4 శాతానికి సమానం. తొలి త్రైమాసికంలో 10.8 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యలోటు రెండో త్రైమాసికంలో 14.8 బిలియన్ డాలర్ల (రూ.1,08,231 కోట్ల)కు పెరుగడమే కరెంట్ ఖాతా మిగులు తగ్గుదలకు కారణమని రిజర్వు బ్యాంకు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో కరెంట్ ఖాతా మిగులు 19.2 బిలియన్ డాలర్లు (జీడీపీలో 3.8 శాతం)గా, గత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో 7.6 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.1 శాతం)గా ఉన్నట్లు ఆర్బీఐ వివరించింది. గత ఆర్థిక సంవత్సర ప్రథమార్ధంలో దేశ కరెంట్ ఖాతాలో లోటు నమోదైంది. అది జీడీపీలో 1.6 శాతానికి సమానం.
తాజావార్తలు
- మహిళను ముక్కముక్కలుగా నరికేశారు..
- తొమ్మిదికి పెరిగిన మృతులు.. ప్రధాని సంతాపం
- 37 రోజుల పసిబిడ్డకు కరోనా పాజిటివ్
- హృతిక్‌తో ప్రభాస్ మల్టీ స్టారర్ చిత్రం..!
- ‘మైత్రి సేతు’ను ప్రారంభించనున్న ప్రధాని
- కిడ్నీలో రాళ్లు మాయం చేస్తానని.. బంగారంతో పరార్
- ఏడుపాయల హుండీ ఆదాయం రూ.17లక్షల76వేలు
- సూపర్బ్.. భారతదేశ పటం ఆకారంలో విద్యార్థినులు
- బిగ్ బాస్ హారికకు అరుదైన గౌరవం
- కామాంధుడికి జీవిత ఖైదు