సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jun 27, 2020 , 00:19:38

తగ్గిన ఫారెక్స్‌ రిజర్వులు

తగ్గిన ఫారెక్స్‌ రిజర్వులు

న్యూఢిల్లీ, జూన్‌ 26: వరుసగా రెండు నెలలుగా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టిన విదేశీ మారకం నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 19తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్‌ రిజర్వులు 2.078 బిలియన్‌ డాలర్లు తగ్గి 505.566 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ఏప్రిల్‌ 24 తర్వాత ఫారెక్స్‌ రిజర్వులు తగ్గుముఖం పట్టడం ఇదే తొలిసారి. ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 12 మధ్యకాలంలో రిజర్వులు 28.189 బిలియన్‌ డాలర్లు ఎగబాకాయి. 


logo