గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Feb 09, 2020 , 00:21:16

ఇంధన ధరలు దిగొస్తున్నాయ్‌

ఇంధన ధరలు దిగొస్తున్నాయ్‌
  • లీటర్‌ పెట్రోల్‌పై 24 పైసల తగ్గుదల l 27 పైసల వరకు చౌకైన డీజిల్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఫిబ్రవరి 8: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన ఇంధన ధరలు క్ర మంగా శాంతిస్తున్నాయి. అంతర్జాతీ య మార్కెట్లో క్రూ డాయిల్‌ ధరలు దిగిరావడంతోపాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలోపేతంకావడంతో దేశీయంగా ధరలను తగ్గిస్తున్నాయి ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు. వరుసగా పది రోజులుగా ధరలు తగ్గిస్తున్న ఇంధన విక్రయ సంస్థలు శనివారం మరో అడుగుముందుకేసి ఏకంగా 27 పైసల వరకు కోత విధించాయి. గత మూడు నెలల్లో ఒకే రోజులో ఇంతటి స్థాయిలో ధరలు తగ్గించడం ఇదే తొలిసారి. పెట్రోల్‌ ధరలను 23 పైసల నుంచి 24 పైసల వరకు తగ్గించిన సంస్థలు..డీజిల్‌పై 25 పైసల నుంచి 27 పైసల వరకు తగ్గించాయి. 


ఇంధన విక్రయ దిగ్గజం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా ఢిల్లీలో పెట్రోల్‌ ధర 23 పైసలు తగ్గి రూ. 72.45కి దిగిరాగా, డీజిల్‌ ధర 25 పైసలు తగ్గి రూ. 65.43కి చేరుకున్నది.  ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.78.34 నుంచి రూ.78.11కి తగ్గ గా, డీజిల్‌ రూ.68.84 నుంచి రూ.68.57కి దిగొచ్చింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర 25 పైసలు తగ్గి రూ.77.08కి చేరుకోగా, అలాగే డీజిల్‌ ధర 28 పైసలు తగ్గి రూ.71.35గా నమోదైంది. ఆయా నగరాల్లో విధిస్తున్న పన్నుల ఆధారంగా ధరలు మరింత తగ్గనున్నాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌ ధర రూపాయి వరకు తగ్గగా, డీజిల్‌ కూడా ఇంతే స్థాయిలో చౌకైంది. అంతర్జాతీయ రేట్లు, డాలర్‌-రుపీ ఎక్స్చేంజ్‌ ఆధారంగా రోజువారి ధరలను మారుస్తున్నాయి ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు. 


logo
>>>>>>