శుక్రవారం 05 మార్చి 2021
Business - Feb 09, 2021 , 19:28:13

భారత్‌లో రెడ్‌మి నోట్‌ 10 సిరీస్‌ లాంఛ్!‌

భారత్‌లో రెడ్‌మి నోట్‌ 10 సిరీస్‌ లాంఛ్!‌

న్యూఢిల్లీ : భారత్‌లో రెడ్‌మి నోట్‌ 10 సిరీస్‌ను లాంఛ్‌ చేయనున్నట్టు షియోమి ప్రతినిధులు సంకేతాలు పంపారు. రెడ్‌మి నోట్‌ 9 సిరీస్‌కు కొనసాగింపుగా తాజా స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ రానుంది. దీనికి సంబంధించి బుధవారం ఉదయం ప్రకటన ఉంటుందని షియోమి ప్రతినిధులు వెల్లడించిన టీజర్‌లో పేర్కొన్నారు. రెగ్యులర్‌ రెడ్‌మీ నోట్‌ 10తో పాటు రెడ్‌మి నోట్‌ 10 ప్రొను తాజా సిరీస్‌లో లాంఛ్‌ చేయవచ్చని భావిస్తున్నారు. రెడ్‌మి నోట్‌ 10 ప్రొ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 732 ఎస్‌ఓసీ ఆధారంగా పనిచేయడంతో పాటు 5050 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగిఉంటుందని అంచనా.

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ 8జీబీ ర్యామ్‌తో అందుబాటులో ఉండనుంది. భారత్‌లో  రెడ్‌మి నోట్‌ 10 లాంఛ్‌ ఉంటుందనే టీజర్‌ వీడియోలను షియోమి ఇండియా ఎండీ మనుకుమార్‌ జైన్‌, రెడ్‌మి బిజినెస్‌ లీడ్‌ స్నేహ తిన్‌వాల ట్వీట్‌ చేశారు. టీజర్‌ వీడియోలో నూతన స్మార్ట్‌ఫోన్‌ల గురించి నిర్ధిష్ట వివరాలను వెల్లడించలేదు. ఇక బుధవారం కంపెనీ లాంఛనంగా ప్రకటన చేయనుండటంతో రెడ్‌మి నోట్‌  10 సిరీస్‌ వివరాలపై కొంత స్పష్టత రానుంది. 

VIDEOS

logo