శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Business - Jan 08, 2021 , 22:17:31

నెమ్మ‌దిగా రియాల్టీ రివైవ‌ల్‌

నెమ్మ‌దిగా రియాల్టీ రివైవ‌ల్‌

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావాన్ని అధిగ‌మించేందుకు వ‌డ్డీరేట్లు త‌గ్గించ‌డంతో ఈ ఏడాది రియాల్టీ రంగం నెమ్మ‌దిగా కోలుకుంటుంద‌ని కేంద్ర హౌసింగ్‌శాఖ కార్య‌ద‌ర్శి దుర్గాశంక‌ర్ మిశ్రా చెప్పారు. చెన్నై, బెంగ‌ళూరు, పుణె, ముంబైతోపాటు ఎనిమిది న‌గ‌రాల ప‌రిధిలో నివాస ఇండ్ల ధ‌ర‌లు స‌ర్దుబాటుకు గుర‌య్యాయ‌న్నారు. బ‌హుళ సంవ‌త్స‌రాల స్థాయికి వ‌డ్డీరేట్లు ప‌డిపోవ‌డంతో 2020లో చౌక‌ధ‌ర‌కే ఇళ్ల ల‌భ్య‌త మెరుగైందన్నారు. 

మ‌హారాష్ట్ర‌తోపాటు క‌ర్ణాట‌క‌, గుజ‌రాత్ రాష్ట్ర ప్ర‌భుత్వాలు స్టాంప్ డ్యూటీని త‌గ్గించ‌డంతో ఇళ్ల కొనుగోళ్లు పుంజుకున్నాయి. 2020 ద్వితీయార్థంలో జ‌రిగిన స‌గం ఇళ్ల కొనుగోళ్ల‌లో దాదాపు స‌గం ముంబై, పుణెల్లోనే న‌మోద‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ఇత‌ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా స్టాంప్ డ్యూటీని త‌గ్గించే విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నాయ‌ని దుర్గా శంక‌ర్ మిశ్రా చెప్పారు.

2019తో పోలిస్తే 2020 ద్వితీయార్థం ఇళ్ల విక్ర‌యాలు 84 శాతం పెరిగితే, ముంబైలో 193 శాతం, పుణెలో 143 శాతం రికార్డ‌య్యాయి. పోస్ట్ కొవిడ్‌-19 నేప‌థ్యంలో టైర్ వ‌న్‌, టైర్ 2 న‌గ‌రాల్లో రియాల్టీ విక్ర‌యాలు పుంజుకుంటాయ‌ని డీఎస్ మిశ్రా అంచ‌నా వేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo