మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 25, 2020 , 00:08:45

భారత్‌లోకి తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌

భారత్‌లోకి తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌
  • విడుదల చేసిన రియల్‌మీ ప్రారంభ ధర రూ.37,999

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: చైనాకు చెందిన ప్రముఖ మొబైళ్ల తయారీ సంస్థ రియల్‌మీ..దేశీయ మార్కెట్లోకి తన తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 5జీ సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన ఎక్స్‌50 ప్రొ ప్రారంభ ధరను రూ.37,999గా నిర్ణయించింది. కంపెనీ విడుదల చేసిన అత్యంత విలువైన ఫోన్‌ ఇదే కావడం విశేషం. భారత మార్కెట్లోకి తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడం గర్వంగా ఉన్నది..అత్యంత వేగవంతంగాను, పనితీరులోనూ ఈ ఫోన్‌ చరిత్ర సృష్టించనున్నదని రియల్‌మీ ఇండియా సీఈవో మాధవ్‌ సేత్‌ తెలిపారు. మూడు రకాల్లో లభించనున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.37, 999, రూ.39,999, రూ.44,999గా ధరలను నిర్ణయించిందన్నారు. డ్యూయల్‌ సిమ్‌ స్లాట్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్లో 4జీ, 5జీ సేవలు పొందవచ్చునని ఆయన చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో 5జీ సేవలు అందుబాటులో లేకపోవడంతో ఈ ఫోన్‌కు పెద్దగా విలువ ఉండకపోవచ్చునని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. 


ఆర్థిక సేవల్లోకి రియల్‌మీ పైసా

రియల్‌మీకి చెందిన అనుబంధ సంస్థయైన రియల్‌మీ పైసా ఆర్థిక సేవల విభాగంలోకి అడుగుపెట్టింది. రుణాలు, పొదుపు, చెల్లింపులు, బీమా రంగంలో సేవలు అందించనునున్నట్లు కంపెనీ అధినేత వరుణ్‌ శ్రీధర్‌ తెలిపారు. రూ.8 వేల నుంచి లక్ష రూపాయల లోపు వ్యక్తిగత రుణాలు అందించనున్న సంస్థ..రూ.50 వేల నుంచి రూ.5 లక్షల లోపు వ్యాపార రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. వ్యక్తిగత రుణాలపై 14 శాతం నుంచి 36 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్న సంస్థ..వ్యాపార రుణాలపై 11-24 శాతం లోపు విధిస్తున్నది. మరోవైపు వీ-వర్క్‌తో కలిసి హ్యాకథాన్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ హ్యాకథాన్‌లో గెలుపొందిన వారిలో మొదటి బహుమతి కింద రూ.10 లక్షలు, రెండో బహుమతి కింద రూ.5 లక్షలు అందిస్తున్నట్లు చెప్పారు.  


logo
>>>>>>