గురువారం 04 మార్చి 2021
Business - Jan 12, 2021 , 00:19:03

హైదరాబాద్‌లో పెరిగిన రియల్‌ ధరలు

హైదరాబాద్‌లో పెరిగిన రియల్‌ ధరలు

హైదరాబాద్‌, జనవరి 11: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం తిరిగి కోలుకుంటున్నది. కరోనా వైరస్‌తో వరుసగా రెండు త్రైమాసికాలుగా ఢీలా పడిపోగా..అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్యకాలంలో తిరిగి పుంజుకున్నాయి. ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరేజ్‌ సంస్థ ప్రాప్‌టైగర్‌ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. నూతన ప్రాజెక్టులు, అమ్మకాలు తిరిగి పుంజుకున్నాయని తెలిపింది. ఉత్తరాధితో పోలిస్తే దక్షిణాదిలోని బెంగళూరు, చెన్నై, భాగ్యనగరంలో సానుకూల పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొంది. దేశ ప్రారంభ ప్రాజెక్టుల్లో ఈ మూడు నగరాల వాటా 43 శాతంగా ఉన్నదని, అలాగే విక్రయాల్లో 29 శాతం వాటాని తెలిపింది.

VIDEOS

logo