శనివారం 06 జూన్ 2020
Business - Apr 16, 2020 , 00:53:27

ఉచిత మరమ్మతులు

ఉచిత మరమ్మతులు

  • హైదరాబాద్‌లో అత్యవసర సర్వీసులకు అందిస్తున్న రెడీ అసిస్ట్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15: అత్యవసర వాహనాలకు ఉచితంగా మరమ్మతులు అందిస్తున్నట్లు బెంగళూరుకు చెందిన రెడీ అసిస్ట్‌ ప్రకటించింది. ఈ లాక్‌డౌన్‌ సమయంలో  డాక్టర్లు, వ్యక్తిగత పోలీస్‌ వాహనాలు, ఇతర అత్యవసర వాహనాలకు టెక్నికల్‌గాను, మరమ్మతులు ఉచితంగా అందించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, మంగళూరు, మైసూరు, విజయవాడల్లో ఈ సేవలను అందిస్తున్నట్లు కంపెనీ ఫౌండర్‌, సీఈవో విమల్‌ సింగ్‌ తెలిపారు. 24 గంటలపాటు అందించనున్న ఈ సేవలకోసం టోల్‌-ఫ్రీ నంబర్‌ను ప్రకటించింది కూడా.  అత్యవసర సమయాల్లో సేవలు అందిస్తున్న మెడికల్‌ ప్రొఫెషనల్స్‌, సరుకు రవాణా, ఆహార పదార్థాలు తీసుకొని రోడ్డుమీద వెళ్తున్నప్పుడు వాహనాలు బ్రేక్‌డౌన్‌ అవుతున్నాయని, వీటికి ఉచితంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ వినూత్న సేవలకు శ్రీకారం చుట్టినట్లు ఆయన చెప్పారు. 


logo