గురువారం 28 మే 2020
Business - May 13, 2020 , 00:54:06

మనేసర్‌ ప్లాంట్‌లో మళ్లీ ఉత్పత్తి

మనేసర్‌ ప్లాంట్‌లో మళ్లీ ఉత్పత్తి

న్యూఢిల్లీ, మే 12: కరోనా లాక్‌డౌన్‌తో దాదాపు 50 రోజులపాటు మూతపడిన ఆటోమొబైల్‌ పరిశ్రమలు మళ్లీ క్రమంగా తెరుచుకొంటున్నాయి. మనేసర్‌ (హర్యానా)లోని తమ ప్లాంట్‌లో కార్ల ఉత్పత్తిని మంగళవారం పునఃప్రారంభించినట్టు దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ వెల్లడించింది. ప్రస్తుతం సింగిల్‌ షిఫ్ట్‌ పద్ధతిలో 75 శాతం మంది ఉద్యోగులను విధులకు అనుమతించామని, ఈ ప్లాంట్‌ నుంచి మొదటి కారు మంగళవారమే బయటికి వచ్చిందని ఎంఎస్‌ఐ చైర్మన్‌ ఆర్సీ భార్గవ తెలిపారు. ఇదేవిధంగా తమ డీలర్‌షిప్‌లతోపాటు సర్వీస్‌ ఔట్‌లెట్లలో కార్యకలాపాలను పాక్షికంగా పునఃప్రారంభించినట్టు టొయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ (టీకేఎం) మంగళవారం ప్రకటించింది. 

ఏపీలో కియా ఉత్పత్తి మొదలు

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలోగల కియా కార్ల ప్లాంట్‌లో ఉత్పత్తి మొదలైంది. లాక్‌డౌన్‌తో మూతబడ్డ పరిశ్రమ మంగళవారం తెరుచుకున్నది. ఈ పరిశ్రమలో 4,500 మంది పనిచేస్తుండగా, ప్రస్తుతం వెయ్యి మందితోనే నడుస్తున్నది. అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నామని, కార్లను శ్రీలంకకు ఎగుమతి చేస్తున్నామని యాజమాన్యం తెలిపింది.


logo