బుధవారం 03 జూన్ 2020
Business - Apr 21, 2020 , 00:20:13

జూన్‌ 5న ఆర్బీఐ తదుపరి సమీక్ష

జూన్‌ 5న ఆర్బీఐ తదుపరి సమీక్ష

ముంబై, ఏప్రిల్‌ 20: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రిజర్వుబ్యాంక్‌ తన ద్రవ్య పరపతి సమీక్ష(ఎంపీసీ) సమావేశాల తేదిలను ప్రకటించింది. తొలి సమీక్షను జూన్‌ 5న ప్రకటించబోతున్నది. వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకోవడానికి ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన ఏర్పాటైన  ఈ కమిటీ 2020-21లో ఐదుసార్లు  సమావేశం కాబోతున్నది. తొలి సమావేశం జూన్‌ 3 నుంచి 5 వరకు జరుగనుండగా, చివరి రోజు కమిటీ నిర్ణయాలను ప్రకటించనున్నది. అలాగే ఆగస్టు 4 నుంచి 6 వరకు రెండోసారి, సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 1 వరకు మూడోసారి, డిసెంబర్‌ 2 నుంచి 4 వరకు నాలుగోసారి, ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు ఐదోసారి భేటీ అవుతున్నది. ఆర్బీఐ చట్టం 1934 ప్రకారం ప్రతియేడాది కనీసంగా నాలుగు సార్లు సమావేశం కావాలి. కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో గత నెల 24 నుంచి 27 వరకు సమావేశం నిర్వహించారు.


logo