ముంబై: దేశీయ క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లకు ఆర్బీఐ గొప్ప రిలీఫ్ ఇచ్చింది. కస్టమర్ల శ్రద్ధను ద్రుష్టిలో పెట్టుకుని ఆర్బీఐ ఈ వివరణిచ్చింది. క్రిప్టో కరెన్సీ లావాదేవీలను నిషేధిస్తూ 2018లో జారీ చేసిన వివరణను వాడొద్దని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు సూచించింది.
దేశంలో క్రిప్టో కరెన్సీలతో లావాదేవీలను నిషేధిస్తూ.. 2018 ఏప్రిల్ ఆరో తేదీన ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2018 నాటి ఆర్బీఐ ఆదేశాలను పక్కన బెడుతూ గతేడాది మార్చి నాలుగో తేదీన సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో 2018 ఆదేశాలు నిరర్ధకమని ఆర్బీఐ పేర్కొంది.
క్రిప్టో కరెన్సీలతో లావాదేవీలు జరుపొద్దని హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డు వంటి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ ఖాతాదారులను హెచ్చరించిన నేపథ్యంలో ఆర్బీఐ వివరణ ఇచ్చింది. బిట్‌కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీలతో లావాదేవీల నిర్వహణకు ఆర్బీఐ లైసెన్స్ ఇవ్వలేదని ఎస్బీఐ కార్డు తెలిపింది.
ఒకవేళ బిట్ కాయిన్ వంటి ఏదేనీ వర్చవల్ కరెన్సీతో గానీ, క్రిప్టో కరెన్సీతో గానీ లావాదేవీలు జరిపితే ఖాతాదారులకు జారీ చేసిన క్రెడిట్ కార్డులను రద్దు లేదా సస్పెండ్ చేస్తామన్నది. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం క్రిప్టో కరెన్సీలతో లావాదేవీలు జరిపిన కస్టమర్లు 30 రోజుల్లో తమ శాఖను సంప్రదించాలని సూచించింది.
రేపట్నుంచి బ్యాంకుల పని వేళల్లో మార్పు
ఐటీ రూల్స్: ఫిర్యాదుల స్వీకరణకు సోషల్ మీడియా ఏర్పాట్లు!
చిన్న వ్యాపారులకు రిలీఫ్.. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ!
ఎస్బీఐ vs యాక్సిస్ vsహెచ్డీఎఫ్సీ ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా..
కరోనా వేళ కస్టమర్లకు ఎస్బీఐ రిలీఫ్.. అదేంటంటే!!
మోదీ సర్కార్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : సచిన్ పైలట్
జూన్ 20 తర్వాత స్పుత్నిక్ వీ టీకాల తొలి బ్యాచ్ రాక
రాజద్రోహానికి పరిమితులను సెట్ చేయాల్సిందే: సుప్రీంకోర్టు
ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
రెండు వేర్వేరు డోసులు తీసుకుంటే ఎలా ? వ్యాక్సిన్ మిక్సింగ్‌పై త్వరలో స్టడీ
కరోనా చికిత్స: రూ.5 లక్షల వరకు అన్సెక్యూర్డ్ లోన్లు!
ఐసోలేషన్ కేంద్రంతో నిరుపేదలకు మేలు