ముంబై: దేశంలో విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. మార్చి 12తో ముగిసిన వారాంతానికిగాను మరో 1.739 బిలియన్ డాలర్లు పెరిగి 582.037 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వుబ్యాంక్ వెల్లడించింది. అంతక్రితం వారంలో ఫారెక్స్ రిజర్వులు 4.255 బిలియన్ డాలర్లు తగ్గి 580.299 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.