బుధవారం 03 జూన్ 2020
Business - May 05, 2020 , 01:13:16

మరో 3 నెలలుమారటోరియం

మరో 3 నెలలుమారటోరియం

పొడిగించే యోచనలో ఆర్బీఐ

న్యూఢిల్లీ, మే 4: రుణాల చెల్లింపులపై మరో 3 నెలలపాటు మారటోరియంను ఆర్బీఐ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ను మరికొంతకాలం కేంద్ర ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో మారటోరియంనూ పెంచాలన్న ప్రతిపాదనను రిజర్వ్‌ బ్యాంక్‌ గట్టిగా పరిశీలిస్తున్నది. ఇప్పటికే అన్ని రకాల రుణాలపై ఈఎంఐ చెల్లింపులకు సంబంధించి మూడు నెలల వెసులుబాటును ఆర్బీఐ కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 31తో ఈ గడువు తీరిపోతున్నది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల ఈఎంఐలపై మారటోరియం తీసుకునే వీలును రుణగ్రహీతలకు కల్పించాలని బ్యాంకింగ్‌, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు మార్చి 27న ఆర్బీఐ సూచించింది. కరోనా వైరస్‌ కట్టడి కోసం మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా కేంద్రం లాక్‌డౌన్‌ను అమల్లోకి తీసుకువచ్చిన సంగతి విదితమే. దీన్ని ఇటీవలే ఈ నెల 17దాకా పొడిగించారు. దీంతో భారతీయ బ్యాంకుల సంఘం సహా వివిధ వర్గాల నుంచి మారటోరియంను పొడిగించాలన్న విజ్ఞప్తులు ఆర్బీఐకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ అంశాన్ని ఆర్బీఐ చురుగ్గా పరిశీలిస్తున్నది. మారటోరియంను పెంచితే జూన్‌, జూలై, ఆగస్టు నెలల ఈఎంఐలను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మొత్తాలను బ్యాం కులు తర్వాతి కాలంలో వసూలు చేసుకుంటాయి. 


logo