Business
- Dec 04, 2020 , 10:43:20
రెపో రేటును మార్చని ఆర్బీఐ

ముంబై: కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్చలేదు. దీంతో రెపో రేటు 4 శాతంగానే కొనసాగుతోంది. రేట్లను యథావిధిగా కొనసాగించడం ఇది వరుసగా మూడోసారని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. మానిటరీ పాలసీ కమిటీ దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు. రివర్స్ రెపో రేటు కూడా 3.35 శాతంగానే కొనసాగుతోంది. కొవిడ్-19 ప్రభావాన్ని సాధ్యమైనంత వరకూ తగ్గిస్తూ.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడమే లక్ష్యంగా మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలు తీసుకుంటోందని శక్తికాంత దాస్ చెప్పారు. రెపో రేటు అంటే వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే అప్పుపై విధించే వడ్డీ రేటు.
తాజావార్తలు
- 'కుట్రతోనే రైతు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ జాప్యం'
- హాఫ్ సెంచరీలతో చెలరేగిన శార్దూల్, సుందర్
- వాట్సాప్ కొత్త స్టేటస్ చూశారా?
- ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్
- బ్రిస్బేన్ టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత
- కర్నాటకలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న అమిత్‌షా
- డెంటల్ సీట్ల భర్తీకి అదనపు కౌన్సెలింగ్
- పొగమంచు ఎఫెక్ట్.. 26 రైళ్లు ఆలస్యం..
- రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా కేసులు
- దేశంలో కొత్తగా 15,144 కరోనా పాజిటివ్ కేసులు
MOST READ
TRENDING