Business
- Feb 05, 2021 , 10:37:11
VIDEOS
కీలక వడ్డీ రేట్లను మార్చని ఆర్బీఐ

న్యూఢిల్లీ: బడ్జెట్ తర్వాత జరిగిన తొలి మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో కీలక వడ్డీ రేట్లను అలాగే ఉంచాలని నిర్ణయించారు. దీంతో రెపో రేటు 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగనుంది. ఎంపీసీ మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. గతేడాది కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి గత మార్చి తర్వాత రెపో రేటును ఆర్బీఐ 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది. చివరిసారి గతేడాది మే 22న రెపో రేటును తగ్గించిన రిజర్వ్ బ్యాంక్.. అప్పటి నుంచీ ఎలాంటి మార్పులు చేయడం లేదు. రెపో రేటు అంటే బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ శాతం. ఇక రివర్స్ రెపో అంటే బ్యాంకుల నుంచి ఆర్బీఐ తీసుకున్న రుణాలపై ఇచ్చే వడ్డీ.
తాజావార్తలు
- ఆర్ఆర్ఆర్ టీంతో కలవనున్న అలియా.. !
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు చిరంజీవి కన్నుమూత
- అమెరికన్ యోధులతో ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ ఫైట్
- బీజేపీకి షాక్.. కాంగ్రెస్లో చేరిన మంత్రి
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
MOST READ
TRENDING