డిజిటల్ కరెన్సీపై కసరత్తు : అతిత్వరలో ఆర్బీఐ ప్రకటన

ముంబై : డిజిటల్ కరెన్సీ మోడల్‌పై కేంద్ర బ్యాంక్ అంతర్గత కమిటీ కసరత్తు సాగుతోందని, దీనిపై త్వరలోనే ఓ నిర్ణయంతో ముందుకు వస్తామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో తెలిపారు. డిజిటల్ కరెన్సీపై ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ గతంలోనే ప్రకటన చేసిందని గుర్తుచేశారు. అంతర్గత కమిటీ కసరత్తు పూర్తికాగానే అతిత్వరలో దీనిపై ప్రకటన చేస్తామని చెప్పారు. బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతున్న క్రమంలో అధికారిక డిజిటల్ కరెన్సీని తీసుకువస్తామని ఆర్బీఐ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధిస్తామని ప్రభుత్వం గతవారం విస్పష్ట సంకేతాలు పంపింది. ఇక డిజిటల్ కరెన్సీకి సంబంధించి తాము ఇప్పటికే డాక్యుమెంట్‌ను విడుదల చేశామని, ఆర్బీఐలో డిజిటల్ కరెన్సీ పనులు కొనసాగుతున్నాయని తమ డిజిటల్ చెల్లింపుల పత్రంలో పేర్కొన్నామని కేంద్ర బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగా ప్రైవేట్ డిజిటల్ కరెన్సీలు, వర్చువల్ కరెన్సీ, క్రిప్టోకరెన్సీలకు ఇటీవల ఆదరణ పెరుగుతోంది. వీటిపై నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తుండటంతో వీటితో పొంచిఉన్న రిస్క్‌ల పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
- ప్రయాణాల్లో ఆహార చిట్కాలు
- కుమార్తెను నరికి.. తలతో గ్రామంలో నడిచిన తండ్రి
- వ్యవసాయం చేయకపోతే తినడం మానేయాలి: శ్రీకారం రైటర్
- ధోనీ రికార్డును సమం చేసిన కోహ్లీ
- పీఎఫ్ వడ్డీరేటు 8.5 శాతమే
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఉర్దూ టీచర్స్ అసోసియేషన్
- ఆటగాళ్లకు కరోనా.. పాకిస్థాన్ సూపర్ లీగ్ వాయిదా
- చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
- చెన్నై చేరుకున్న ధోనీ, రాయుడు..త్వరలో ట్రైనింగ్
- రాఫెల్ స్ఫూర్తితో.. ‘పంజాబ్ రాఫెల్’ వాహనం