డ్యూయిష్ బ్యాంక్‌కు రూ.2 కోట్ల జరిమానా విధింపు

ముంబై : డ్యూయిష్ బ్యాంక్ ఏజీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కన్నెర్రజేసింది. డిపాజిట్ రేట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు డ్యూయిష్ బ్యాంక్ ఏజీకి రూ.2 కోట్ల జరిమానా విధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్బీఐ ప్రకారం, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46 (4) (ఐ) లోని, సెక్షన్ 47 ఏ (1) (సీ) లోని నిబంధనల ప్రకారం ఈ జరిమానా బ్యాంకుపై విధించారు. లోపాల కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఆర్బీఐ సూచనలను పాటించనందుకు ఎందుకు జరిమానా విధించకూడదంటూ బ్యాంకుకు మొదట నోటీసు జారీ చేశారు. బ్యాంకు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని ఆర్బీఐ.. తమ సూచనలు పాటించలేదని తేలిన తర్వాత బ్యాంకుపై రూ.2 క్లో జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వాస్తవానికి, 2019 మార్చి 31న డ్యూయిష్ బ్యాంక్ ఏజీ ఆర్థిక స్థితి, రిస్క్ అసెస్మెంట్ నివేదికను పరిశీలించిన తరువాత, ఆర్బీఐ డిపాజిట్లపై వడ్డీ రేటు డైరెక్టివ్ 2016 ను బ్యాంక్ పాటించలేదని తేలింది. దీని తరువాత బ్యాంకుకు నోటీసు జారీ చేశారు. డ్యూయిష్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ (ఎస్సీబీ) తో సహా ఐదు విదేశీ బ్యాంకులకు కూడా ఆర్బీఐ జరిమానా విధించింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) కు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ బ్యాంకులకు జరిమానా వేశారు. అప్పుడు డ్యూయిష్ బ్యాంకుకు రూ.20 వేల జరిమానా విధించారు. డ్యూయిష్ బ్యాంక్ ఏజీ జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్నది. ఈ బ్యాంకుకు 72 దేశాల్లో 80 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ట్రంప్‌కు మరిన్ని దెబ్బలు తప్పవా..?!
అంతరిక్షం నుంచి నా దేశాన్ని చూస్తున్నా..
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కాషాయ దుస్తులలో పవన్ కళ్యాణ్.. వైరల్‌గా మారిన ఫొటోలు
- మంత్రిపై లైంగిక దాడి ఆరోపణలు.. ఫిర్యాదు వెనక్కి తీసుకున్న మహిళ
- UPI యూజర్లకు గమనిక.. ఆ టైమ్‌లో పేమెంట్స్ చేయొద్దు
- టోక్యో ఒలింపిక్స్ రద్దు.. జపాన్ ప్రభుత్వ నిర్ణయం!
- ఎఫ్బీ డేటా చోరీ.. క్యాంబ్రిడ్జ్ అనలిటికాపై సీబీఐ కేసు
- రెండోదశలో జర్నలిస్టులకూ కరోనా టీకా!
- పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదం.. లక్ష్య టీజర్
- హరితేజకూ హ్యాకింగ్ కష్టాలు తప్పలేదు..!
- వరల్డ్ రికార్డ్.. ఇలాంటి గోల్ ఎప్పుడైనా చూశారా.. వీడియో
- తెలంగాణలో కొత్తగా 214 కరోనా కేసులు