బుధవారం 27 మే 2020
Business - Apr 18, 2020 , 03:20:24

రియల్‌ రంగానికి ఊతం

రియల్‌ రంగానికి ఊతం

  • ఆర్బీఐ నిర్ణయాన్ని స్వాగతించిన దేశీయ నిర్మాణ రంగం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రియల్‌ ఎస్టేట్‌ రంగానికి రిజర్వు బ్యాంక్‌ తీపి కబురును అందించింది. నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకుకు రూ.10 వేల కోట్ల నగదును కేటాయిస్తు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు భారత నిర్మాణ రంగం ప్రకటించింది. అయినప్పటికీ ఈ రంగం  పూర్తిగా కోలుకోవాలంటే సమగ్ర ప్యాకేజీని ప్రకటించాలని కోరుతున్నది.    ఆయా రుణాలను రీ స్ట్రక్చర్‌ చేయకుండానే మరో ఏడాది దాకా కార్యకలాపాల్ని ఆరంభించేందుకు గడువును రిజర్వు బ్యాంక్‌  పొడిగించింది. ఇది నిర్మాణ రంగానికి ఎక్కడలేని ప్రయోజనాన్ని చేకూర్చుతుందని క్రెడాయ్‌ ఛైర్మన్‌ జక్సే షా తెలిపారు. ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, దీని వల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని క్రెడాయ్‌ తెలంగాణ అధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి తెలిపారు. 

రుణాల పునర్‌వ్యవస్థీకరణకు కృషి: హర్‌దీప్‌సింగ్‌

డెవలపర్ల రుణాల్ని పునర్‌ వ్యవస్థీకరించేందుకు కృషి చేస్తామని కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరదీప్‌సింగ్‌ పూరి తెలిపారు.  శుక్రవారం క్రెడాయ్‌ నేషనల్‌ నిర్వహించిన సదస్సులో ఆయన  మాట్లాడుతూ.. ఆస్తుల కొనుగోలు, రుణాల పంపిణీలో డిజిటల్‌ లావాదేవీలను సులభతరం చేసేందుకు పరిష్కారం కనుగొనాలని సూచించారు.  


logo