మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Business - Aug 05, 2020 , 02:07:16

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సారథిగా జగదీశన్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సారథిగా జగదీశన్‌

  • ఆర్బీఐ ఆమోదం.. అక్టోబర్‌లో బాధ్యతలు

ముంబై: దేశంలోని ప్రైవేటు రంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పగ్గాలను ఆ బ్యాం కు ‘స్ట్రాటజిక్‌ చేంజ్‌ ఏజెంట్‌', ఫైనాన్స్‌ విభాగ అధిపతి శశిధర్‌ జగదీశన్‌ (55) అందుకోనున్నారు. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీఈవో, ఎండీగా వ్యవహరిస్తున్న ఆదిత్య పురి స్థానంలో అక్టోబర్‌ చివరి నుంచి జగదీశన్‌ ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. తమ సంస్థ సీఈవో, ఎండీగా జగదీశన్‌ నియామకాన్ని రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఆమోదించిందని, అక్టోబర్‌ 27 నుంచి మూడేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మంగళవారం వెల్లడించింది. logo