బుధవారం 03 జూన్ 2020
Business - May 03, 2020 , 02:13:39

సీకేపీ సహకార బ్యాంకు మూత

సీకేపీ సహకార బ్యాంకు మూత

లైసెన్సు రద్దుచేసిన ఆర్బీఐ

న్యూఢిల్లీ, మే 2:  సీకేపీ సహకార బ్యాంకు ఆర్థిక పరిస్థితి దారుణంగా క్షీణించడంతో రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) శనివారం ఆ బ్యాంకు లైసెన్సును రద్దుచేసింది. ఇది ఏప్రిల్‌ 30 సాయంత్రం నుంచే అమల్లోకి వచ్చింది. సీకేపీ సహకార బ్యాంకు మళ్లీ కోలుకొనే పరిస్థితి లేకపోవడంతో ఆ బ్యాంకును పూర్తిగా మూసేస్తున్నామని ఆర్బీఐ స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం ఆ బ్యాంకు ఖాతాదారులు తమ డిపాజిట్లలో రూ.5 లక్షల వరకు మొత్తాలను డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) నుంచి పొందవచ్చని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.logo