హైదరాబాద్‌లో రత్నదీప్ 100వ స్టోర్

హైదరాబాద్: ప్రముఖ రిటైల్ సంస్థ రత్నదీప్ దూకుడు పెంచింది. హైదరాబాద్‌లో తన 100వ స్టోర్‌ను ఆరంభించింది. వ్యాపారాన్ని మరింత విస్తరించే ఉద్దేశంలో భాగంగా దేశవ్యాప్తంగా మరో 50 స్టోర్లను ప్రారంభించాలనుకుంటున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ అగర్వాల్ తెలిపారు. దేశీయ రిటైల్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వచ్చే కొన్నేండ్లలో వ్యాపారాన్ని అన్ని వైపుల విస్తరించనున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా గత కొన్ని నెలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రిటైల్ రంగం.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని, వినియోగదారులు మళ్లీ కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 100 స్టోర్ల మార్క్‌కు చేరుకున్నాం, వచ్చే ఏడాది 150 మార్క్‌కు చేరుకుంటామన్న విశ్వాసమున్నదని కంపెనీ డైరెక్టర్ మనీష్ భార్తీయా తెలిపారు.
భవిష్యత్తుపై ఆశలు
కరోనా కారణంగా రిటైల్ రంగం నిరాశాజనక పనితీరు కనబరిచినప్పటికీ సంస్థ మాత్రం నిలకడైన వృద్ధిని సాధించిందని మనీష్ వెల్లడించారు. 2019-20లో రూ.800 కోట్ల ఆదాయాన్ని సంస్థ ఆర్జించిందన్న ఆయన వచ్చే మార్చి నాటికి రూ.1,200 కోట్లు ఆర్జించగలదనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో మాత్రమే కొత్త స్టోర్లుంటాయని, ఒక్కో స్టోర్ 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సంస్థలో 4 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వీరిలో 70 శాతం మంది మహిళలు కావడం విశేషం.
తాజావార్తలు
- వృద్ధులతో ప్రయాణమా..ఇలా చేయండి
- బీజేపీ దేశంలో విషం నింపుతుంది: శరద్‌పవార్
- ఈసారి ఐపీఎల్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
- ‘అధికారులను కర్రతో కొట్టండి’.. కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- శ్రీశైలం.. ఆది దంపతులకు వరసిద్ధి వినాయకుడి పట్టు వస్త్రాలు
- ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్రస్ మార్చడమెలా
- ఈ మూడు సమస్యలే గుండె జబ్బులకు ముఖ్య కారణాలట..!
- బీజేపీలో చేరి ‘రియల్ కోబ్రా’ను అంటున్న మిథున్ దా
- రసవత్తరంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్