సోమవారం 01 జూన్ 2020
Business - May 07, 2020 , 17:23:20

ఫార్మా స్టార్టప్‌లో రతన్‌టాటా పెట్టుబడులు

ఫార్మా స్టార్టప్‌లో రతన్‌టాటా పెట్టుబడులు

న్యూఢిల్లీ: ఇప్పటికే ఒక స్టార్టప్‌ కంపెనీలో పెట్టుబడి పెట్టిన  రతన్‌టాటా.. ఫార్మాస్యూటికల్‌ రంగంలోని  ఒక స్టార్టప్‌ కంపెనీలో పెట్టుబడులు  పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే పెట్టుబడులు ఎంత  అనేది మాత్రం వెల్లడించలేదు. ఈ  కంపెనీని ప్రారంభించింది మరియు సీఈవో 18 ఏండ్ల వయసున్న అర్జున్‌ దేశ్‌పాండే. సరసమైన ధరలకు మందులను సామాన్యులకు అందివ్వాలన్న లక్ష్యంతో రెండేండ్ల క్రితం ముంబై కేంద్రంగా ఈ కంపెనీని ప్రారంభించాడు. 

తన కంపెనీ గురించి, తన వ్యాపార విధానాల గురించి  తెలుసుకొని ఎంతగానో ఆకర్శణకు గురైన రతన్‌టాటా.. తన కంపెనీలో పెట్టుబడులు  పెడతానంటూ ముందుకొచ్చారని అర్జున్‌ దేశ్‌పాండే చెప్పారు. ప్రతీ భారతీయుడికి జెనరిక్‌ ఔషధాలు చేరుకోవడానికి తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. జెనరిక్‌ ఆధార్‌ సంస్థ ఇప్పటికే ముంబైతోపాటు పుణె, బెంగళూరు, ఒడిశా రాష్ట్రాల్లోని పలు రిటైలర్లతో ఒప్పందం చేసుకొన్నది. రానున్న నెలల్లో గుజరాత్‌, తమిళనాడు, ఏపీ, న్యూఢిల్లీల్లో కూడా తమవ్యాపారాన్ని విస్తరించాలని ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్నారు.


logo