మంగళవారం 09 మార్చి 2021
Business - Dec 16, 2020 , 01:51:01

చింతల, కిరణ్‌లకు అరుదైన గౌరవం

చింతల, కిరణ్‌లకు అరుదైన గౌరవం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నాబార్డ్‌ చైర్మన్‌ చింతల గోవిందరాజులుతోపాటు హైదరాబాద్‌కు చెందిన కోమేక్‌ఐటీ సంస్థ సహవ్యవస్థాపకుడు, ఎండీ కిరణ్‌ మధునాపంతులకు ఎకనామిక్‌ టైమ్స్‌ ప్రతిష్ఠాత్మక అవార్డులు దక్కాయి. బ్యాంకింగ్‌ రంగంలో అందించిన సేవలకుగాను చింతలకు ‘ఆసియాలో అత్యంత నమ్మకమైన బిజినెస్‌ లీడర్‌' అవార్డును ఎకనామిక్‌ టైమ్స్‌ ప్రకటించింది. వ్యాపార రంగంలో ఆసియా స్థాయిలో అత్యంత ఆశాజనకమైన నాయకులకు ఇచ్చే పురస్కారం కిరణ్‌ను వరించింది. ఆన్‌లైన్‌ వేదికగా మంగళవారం జరిగిన ఏషియన్‌ బిజినెస్‌ లీడర్స్‌ సదస్సులో ఈ పురస్కారాలను విజేతలకు అందించారు.

VIDEOS

logo