శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Jan 25, 2020 , 00:40:33

రూ. వెయ్యి కోట్ల విదేశీ నల్లధన ఆస్తులు

రూ. వెయ్యి కోట్ల విదేశీ నల్లధన ఆస్తులు
  • లలిత్‌ హోటల్స్‌పై ఐటీ సోదాలు

న్యూఢిల్లీ, జనవరి 24: భారత్‌ హోటల్స్‌ గ్రూప్‌పై ఆదాయం పన్ను (ఐటీ) శాఖ జరిపిన సోదాల్లో భారీగా విదేశీ నల్ల ధన ఆస్తులు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా లలిత్‌ హోటల్స్‌ బ్రాండ్‌ పేరుతో లగ్జరీ హోటళ్లను ఈ గ్రూప్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీ, దాని చుట్టుపక్కల గల గ్రూప్‌ ఆస్తులపై ఈ నెల 19న ఐటీ శాఖ దాడులు చేసింది. ఆఫీసులు, హోటళ్లతోపాటు సంస్థ సీఎండీ జ్యోత్స్న సూరి, ఇతరులకు చెందిన 13చోట్ల ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా వెయ్యి కోట్ల రూపాయలకుపైగా అప్రకటిత విదేశీ ఆస్తులను గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శుక్రవారం తెలియజేసింది. బ్రిటన్‌లోని హోటల్‌తోపాటు బ్రిటన్‌, యూఏఈల్లోగల స్థిరాస్తులు, విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్లు ఇందులో ఉన్నాయి. దేశీయంగా రూ.35 కోట్లకుపైగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లూ తేలింది. రూ.71.5 లక్షల నగదు, రూ.23 కోట్ల విలువైన నగలు, రూ.1.2 కోట్ల విలువైన ఖరీదైన వాచీలుసహా మొత్తం రూ.24.93 కోట్ల అప్రకటిత ఆస్తులను ఐటీ శాఖ అధికారులు జప్తు చేశారు.logo